VJS51 : గ్యాంబ్లింగ్ డ్రామాగా మక్కల్ సెల్వన్ మూవీ..!

VJS51 : కోలీవుడ్ స్టార్ హీరో “విజయ్ సేతుపతి” గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. “మక్కల్ సెల్వన్” గా అభిమానుల చేత పిలిపించుకునే విజయ్ సేతుపతి కోలీవుడ్ లో కమల్ హాసన్, విక్రమ్ ల తర్వాత ఆ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పించే హీరోగా, పాత్ర కోసం ఎంతైనా కష్టపడే నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ, ఇప్పుడు హీరోగా విక్రమ్ వేద, 96 వంటి సినిమాల బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు. అయినా సరే బలమైన పాత్ర వస్తే స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించడానికి వెనుకాడడు ఈ విలక్షణ హీరో. ఇక ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీ అవుతున్నాడు. రీసెంట్ గా మేరీ క్రిస్మస్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించగా, నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహస్తున్న మహారాజా, వెట్రిమారన్ యొక్క విడుదలై పార్ట్ 2, మరో రెండు ప్రాజెక్ట్ లు లైన్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తన 51వ చిత్రానికి సంబంధించి టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

విజయ్ సేతుపతి51 టైటిల్ టైటిల్ ఫిక్స్..

కోలీవుడ్ లో ‘ఒరు ​​నల్ల నాన్ రెహతు సెలోరెన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆరుముగ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు పృథ్వీరాజ్ , రాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని భారీ వ్యయంతో 7సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమా (VJS51) యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని రిలీజ్ చేసారు మేకర్స్. విజయ్ సేతుపతి, దర్శకుడు ఆరుముగ కుమార్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి “ఏస్” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ టీజర్‌ను మేకర్స్‌ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.

VJS51 'ACE' movie which is being made as a gambling drama..

- Advertisement -

గ్యాంబ్లింగ్ డ్రామాగా VJS51 సినిమా..

ఇక విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఏస్ సినిమాలో సప్త సాగరాలు బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్, కామెడీ మరియు సెంటిమెంట్ భాగమై ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు మొత్తం మలేషియాలో పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఇక విజయ్ సేతుపతి నటిస్తున్న ఏస్ చిత్రం ఒక గ్యాంబ్లింగ్ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం. అలాగే కమర్షియల్ యాక్షన్ డ్రామాగా కోట్ల రూపాయల డబ్బు కోసం రెండు గ్యాంగ్ ల మధ్య వార్ ఉంటుందని సమాచారం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి రెండు పాచికలు గాల్లో వేస్తూ, సిగిరెట్ పైపుని నోట్లో పెట్టుకుని కలుస్తూ స్టైలిష్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు