Telugu Film Industry: సీఎం ను అభినందించలేదు… కానీ ఈవెంట్‌కి ఆహ్వానిస్తున్నారు

Telugu Film Industry: ఈ సమాజంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్‌ను, ఫెయిల్యూర్ పర్సన్‌ను చూసే విధానం, వాళ్లని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. సక్సెస్‌కి చుట్టాలు ఎక్కువ, ఫెయిల్యూర్‌కి శత్రువులు ఎక్కువ. ఒక వ్యక్తికి సక్సెస్ రాగానే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు వారి చుట్టూ వాలటం అనేది సహజంగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే…

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాల రాజకీయాలకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో రాజకీయ నాయకులతో సినిమా ఇండస్ట్రీ వాళ్లకి ఉన్న సమస్యలు చాలా తక్కువని చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతో సినిమా పరిశ్రమకు ఉన్న విభేదాలు అన్ని ఇన్ని కాదు. దీనికి కారణం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరో హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే ఒక పార్టీని స్థాపించి, అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలను మాత్రమే కాకుండా అన్ని సినిమాల టికెట్ రేట్లను తగ్గించి పడేసింది. అయితే దీనిపై చర్చించడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అప్పట్లో కలిసారు.

సినిమా పరిశ్రమ – తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీ రూల్ చేస్తూ వస్తుంది. అయితే ఆ ప్రభుత్వంలో చాలామంది సినిమా వాళ్ళతో ఆ పార్టీ నాయకులకు మంచి అనుబంధం కుదిరింది. సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా కూడా కెసిఆర్, కేటీఆర్ హాజరవుతూ వచ్చారు. ఒక సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ కేసీఆర్ ను ప్రశంసలతో ముంచేత్తారు. “అందరూ హిస్టరీ క్రియేట్ చేస్తే మీరు జాగ్రఫీ క్రియేట్ చేశారు” అని ఒక సందర్భంలో అన్నారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, రామ్ చరణ్ తేజ్ నటించిన ధ్రువ, తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది, వేణు దర్శకత్వం వహించిన బలగం వంటి సినిమా ఈవెంట్లకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఆ ప్రభుత్వాన్ని కూడా కొద్దిగా ప్రశంసిస్తూ వస్తూ ఉండేవారు.

- Advertisement -

మారిన ప్రభుత్వం

ఇకపోతే రీసెంట్ గానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చాలామంది ఊహించలేదు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఊహించలేదు.
కాంగ్రెస్ పార్టీని పదవిలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చేసిన గ్రౌండ్ లెవెల్ హార్డ్ వర్క్ ను ఎవరు గుర్తించలేదు. రేవంత్ రెడ్డి వేసిన వ్యూహాలు ఎవరికి అంతుచిక్కలేదు. రియాలిటీ కి దూరంగా బతికిన చాలామందికి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించారు అని చెప్పాలి. చాలామంది సినిమా ప్రముఖులు కూడా మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం వస్తుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి పాజిటివ్ గా పోస్టులు కూడా పెట్టి ఎంకరేజ్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి కష్టం, విజన్, ప్లానింగ్ పద్ధతి వీటన్నిటి మధ్య వారి అంచనాలన్నీ తప్పుగానే మిగిలిపోయాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే కళారంగానికి రేవంత్ రెడ్డి ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తారో నంది అవార్డులకి బదులుగా గద్దర్ అవార్డులు ఇస్తామంటూ అనౌన్స్ చేసిన రోజు చాలామందికి తెలుసొచ్చింది.

 

Telangana CM Revanth Reddy

రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపిన ప్రముఖులు

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొన్ని రోజులకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖులు ప్రత్యేకంగా కలిశారు.
సీఎంను కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ వైవీఎస్ చౌదరి వంటి ప్రముఖులు ఉన్నారు. చాలామంది సినిమా ప్రముఖులు కలిసారు కానీ ఆ విక్టరీని ఎవరు పెద్దగా అభినందించలేకపోయారనేది వాస్తవం. గెలిచిన తర్వాత ఫార్మాలిటీకి వెళ్లి కలవాలి కాబట్టి కలిసారు తప్ప, ఆల్మోస్ట్ పని అయిపోయింది అనుకున్న ఒక పార్టీని ఫామ్ లోకి తీసుకొచ్చి ఆ స్థాయిలో గెలుపొందారు అని ఎవరు మనస్ఫూర్తిగా అభినందనలు తెలపలేదనేది ఒప్పుకోలేని వాస్తవం.

ఇకపోతే రీసెంట్ గా కొంతమంది సినిమా ప్రముఖులు రేవంత్ రెడ్డి ను కలిశారు మే 19న జరగబోయే డైరెక్టర్స్ డే ఈవెంట్ కు రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

మనం ముందుగా అనుకున్నట్టు సక్సెస్ రాగానే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు వారి చుట్టూ వాలటం అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు డైరెక్టర్స్ డే కోసం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి వచ్చిన వారిలో చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణాస్వీకారం చేసిన తర్వాత అభినందనలు తెలపలేదు. దీన్నే పాయింట్ గా తీసుకని, అప్పుడు అభినందనలు లేవు.. ఇప్పుడు ఏకంగా ఆహ్వానాలే వస్తున్నాయి అంటూ డైరెక్టర్స్ పైన ట్రోల్స్ వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు