Siddharth40 : తెలుగులో చెయ్యడా ఇంకా.? లవర్ బాయ్ 40వ సినిమా అనౌన్స్ చేసాడు

Siddharth40: మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఆ తర్వాత నటుడుగా, ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక సొంత ఇమేజ్ను సాధించుకున్నాడు లవర్ బాయ్ సిద్ధార్థ. చాలామంది పెద్ద డైరెక్టర్ తో సిద్ధార్థ వర్క్ చేశాడు. శంకర్ దర్శకత్వంలో బాయ్స్, మణిరత్నం దర్శకత్వంలో యువ, అలానే బాలీవుడ్ లో రంగ్ దే బసంత్ వంటి సినిమాల్లో కనిపించాడు సిద్ధార్థ్. ఇకపోతే సిద్ధార్థ కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఆడియోన్స్ సిద్ధార్థ ను లవర్ బాయ్ గా గుర్తిస్తారు.

Nuvvostanante Nenoddantana

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో గుర్తింపు

సిద్ధార్థ కెరియర్లు సూపర్ హిట్ ఆయన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను తీసుకువచ్చింది. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమా సిద్ధార్థ కెరీయర్ లో ఒక బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఒక దర్శకుడుగా కూడా ప్రభుదేవాకు మంచి పేరును తీసుకొచ్చింది ఈ సినిమా. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ పాటలు విన్న ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. అంతటి గొప్ప ఆల్బమ్ ఈ సినిమాతో క్రియేట్ చేశాడు.

- Advertisement -

Bommarillu

బొమ్మరిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. తండ్రి, కొడుకు, ప్రియురాలు మధ్య జరిగే ఈ ముక్కోనపు ప్రేమ కథ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన జెనీలియా నటించిన. ఈ సినిమాతోనే జెనిలియాకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా కూడా దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటలను అందించారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు.

సినిమాలు హిట్ అయిన రాని అవకాశాలు

సిద్ధార్థ కెరియర్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ఆ తర్వాత వచ్చిన ఆట సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించాయి. అయితే ఈ సినిమాలు తర్వాత సిద్ధార్థ కు సరైన హిట్ సినిమా ఒకటి కూడా పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకుడుగా పరిచయమైన ఓ మై ఫ్రెండ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది.

తెలుగులో సినిమాలు చేయడం తగ్గించాడు

అయితే సిద్ధార్థ ఓ మై ఫ్రెండ్ సినిమా తర్వాత తెలుగులో చేసిన సినిమా జబర్దస్త్. ఆ తర్వాత అన్ని సినిమాలు కేవలం తమిళ్ లోనే చేశాడు తమిళ్లో చేసిన ఆ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. అయితే వాటికి కూడా సరైన ఆదరణ దక్కేది కాదు. ఇక రీసెంట్ గా 2021లో అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాలో నటించాడు సిద్ధార్థ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు సిద్ధార్థ్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడితో తెలుగు సినిమాలు చేస్తాడా.? లేకుంటే తమిళ్లో సినిమాలు చేస్తూ తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేస్తాడని అందరికీ అనుమానాలు మొదలయ్యాయి.

Siddharth40

సిద్ధార్థ కొత్త సినిమా అప్డేట్

ఇకపోతే రీసెంట్ గా సిద్ధార్థ తన 40వ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. మహావీరుడు సినిమాను నిర్మించిన శాంతి టాకీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. తొట్టకల్ అనే సినిమాను తీసిన శ్రీ గణేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు