Actor Chandrakanth : పవిత్రతో అక్రమ సంబంధం… ఆమె కోసం 11 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను టార్చర్ చేసిన చంద్రకాంత్

Actor Chandrakanth : కొన్ని రోజుల క్రితం నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవిత్ర జయరామ్‌తో స్నేహంగా ఉన్న తెలుగు టీవీ నటుడు చంద్రకాంత్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడనే షాకింగ్ వార్త బయటకు వచ్చింది. చందు పవిత్ర జయరామ్‌తో సన్నిహితంగా ఉండేవాడు. పవిత్ర మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన చందు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రకాంత్ భార్య అతనికి పవిత్రతో అక్రమ సంబంధం ఉందని, ఆమె కోసం 1 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను టార్చర్ చేశాడంటూ కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది.

చంద్రకాంత్ భార్య కామెంట్స్

తాజాగా చంద్రకాంత్ భార్య శిల్పా మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. కానీ పవిత్రతో పరిచయమైన తర్వాత ప్రతిరోజూ అతను తాగి వచ్చి తనను చిత్రహింసలకు గురి చేసే వాడని, ఇంటి గురించి పట్టించుకోవడమే మానేసాడని వెల్లడించింది. తన అత్తయ్య ఎంత చెప్పినా వినేవాడు కాదని, ఇక పవిత్ర తనకు ఫోన్ చేసి చంద్రకాంత్ నా భర్త నువ్వు మర్చిపో అంటూ వార్నింగ్ ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. దీంతో ఏం చేయాలో తోచక ఆమె కొడుకును కలిస్తే వాళ్ళిద్దరూ ఇష్టపడితే మేమేం చేయగలం మాకు సంబంధం లేదంటూ అతను సమాధానం చెప్పాడని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా చంద్రకాంత్ ఎప్పుడూ ఆమె ధ్యాసలోనే ఉండేవాడని, తన గురించి అందరికీ నెగిటివ్ గా చెబుతూ బ్లేమ్ చేసేవాడని వివరించింది. ఇక 12 ఏళ్లు రిలేషన్షిప్ లో ఉండి పెద్దలను ఒప్పించి 2017 లో తనను పెళ్లాడిన చంద్రకాంత్ పవిత్ర ఎంట్రీ తర్వాత పూర్తిగా మారిపోయాడని, తనను కొట్టడం తిట్టడం వంటి చిత్రహింసలకు గురి చేశాడని షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఇక పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయాక తననే తలుచుకుంటూ ఏడ్చేవాడని గుర్తు చేసుకుంది. ఇన్నాళ్లు ఎప్పటికైనా అతను తనను అర్థం చేసుకుంటాడని, తిరిగి వస్తాడని నమ్మకంతో బ్రతికాను అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు చంద్రకాంత్ పవిత్ర కోసం తన జీవితాన్ని నాశనం చేశాడు అంటూ కన్నీటిపర్యంతం అయింది.

- Advertisement -

పవిత్రతో పెళ్ళికి రెడీ…

బుల్లితెర ఇండస్ట్రీలో ఐదు రోజుల క్రితమే త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. అది ఇంకా మరవక ముందే ఆమె ప్రియుడైన చంద్రకాంత్ నార్సింగ్ లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడడం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే కొంతకాలంగా పవిత్ర, చంద్రకాంత్ లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది.

పవిత్ర విడాకులు…

త్రినయని సీరియల్ లో నటించే టైంకి పవిత్ర తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. మరోవైపు చంద్రకాంత్ శిల్పాను 2015లో ప్రేమించి పెళ్లాడాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే ఆరేళ్ల క్రితం త్రినయని సీరియల్ సమయంలో పవిత్రతో ఏర్పడిన పరిచయం కాస్త చంద్రకాంత్ తో ఆమె ప్రేమాయణానికి దారి తీసింది. పవిత్ర, జయరాం ఇద్దరరూ ప్రేమలో మునిగితేలడంతో, ఆయన తన భార్య శిల్పను పట్టించుకోవడం మానేసాడని సమాచారం.

బెంగుళూరు నుంచి వెళ్తుండగా ప్రమాదం

చందు పలు తెలుగు సీరియల్స్‌లో నటించారు. ఇటీవల పవిత్ర జయరామ్‌తో కలిసి బెంగళూరు వచ్చాడు. ఓ సినిమాకు సంతకం చేసి మళ్లీ హైదరాబాద్‌కు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చందు గాయపడ్డాడు. ఈ ప్రమాదంలోనే పవిత్ర కన్నుమూసింది. ఆ విషాదం మరువక ముందే చందు కన్నుమూశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు