Ram Charan Tej : గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు , గోల్డ్ ను మించిన మనసున్న స్టార్

Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. చిరు తనయుడుగా చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. తనకంటూ ఒక స్టైల్ ను ఏర్పరచుకున్నాడు. రెండవ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఉన్న రికార్డులన్నీ చెరిపేసాడు. కేవలం సినిమాల్లోనే హీరోయిజం కాకుండా రియల్ లైఫ్ లో కూడా రామ్ చరణ్ హీరో అనిపించుకున్నాడు. ఉదాహరణలు చెప్పడానికి ఎన్నో వందలు. తండ్రి చిరంజీవి లోని టాలెంట్ తో పాటు మంచి వ్యక్తిత్వం కూడా చరణ్ కి వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు.

Ram Charan With Noor Family

రామ్ చరణ్ అభిమానిపై చూపించే ప్రేమ

రంగస్థలం అనే సినిమాతో చరణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే సినిమాల ద్వారా కాకుండా రామ్ చరణ్ వ్యక్తిత్వానికి కూడా అభిమానులు ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో రామ్ చరణ్ తన మంచితనాన్ని చాటుకున్నారు. మెగా ఫ్యామిలీకి నూర్ ఎంత పెద్ద అభిమానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిమాని చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కలిసి 10 లక్షల రూపాయలు చెక్కును ఆ కుటుంబానికి అందించారు. ప్రతి నటులకి కూడా వాళ్లు చేసిన సినిమాలు హిట్ అయితే కలెక్షన్స్ తో పాటు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. కొందరికి అవార్డ్స్ కూడా వస్తుంటాయి. అవార్డులను కొంతమంది కొందరికి డెడికేట్ చేస్తారు
డిసెంబర్ 10 2019 రామ్ చరణ్ కి వచ్చిన అవార్డును నూర్ ఫ్యామిలీకి డెడికేట్ చేశారు.

- Advertisement -

3 ఇయర్స్ కిడ్ ధనుష్ కి హెల్ప్ చెయ్యడం

ధనుష్ అనే త్రీ ఇయర్స్ కిడ్ కి ఒక కిడ్నీ సమస్య వస్తే తన ట్రీట్మెంట్ కి సంబంధించిన ఖర్చులన్నీ తానే భరించి తనను కాపాడాడు. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఉన్న జానీ మాస్టర్ వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో తన పరిస్థితి బాగోలేదు ఆపరేషన్ చేయించలేని చెప్పినప్పుడు. రామ్ చరణ్ తో మాట్లాడాలి అని ప్రయత్నించారు జానీ. అయితే రామ్ చరణ్ అప్పటికే మౌనవ్రతంలో ఉన్నారు విషయం చెప్పండి అంటూ చరణ్ తరపు మేనేజర్ అడిగారు. అయితే జానీ విషయం చెప్పగానే మౌనవ్రతం వీడి హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు. జానీ మాస్టర్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత కేవలం 350 రూపాయలు ఫార్మాలిటీ ఫిజ్ మాత్రమే అక్కడ కట్టించుకొని. మిగతా ఫీజ్ ఎంత ఉపాసన గారు కట్టేసారని అక్కడ చెప్పారు.

రామ్ చరణ్ వ్యక్తిత్వానికి నిదర్శనం

గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే,ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సినీ నటుడు కాదంబరి కిరణ్, దర్శకుడు సుకుమార్ చొరవతో రాంచరణ్ ని అడిగి 2లక్షలు తీసుకుని “మనం సైతం” ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసారు. అవికాక సుకుమార్ తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప పేరున FD చేయమని ఇవ్వడం జరిగింది. కొన్ని రోజులు తర్వాత నటుడు కాదంబరి కిరణ్ రామ్ చరణ్ కి ఎదురుపడితే “ఆపాప ఎలావుంది కాదంబరి గారూ? అని అడిగాడు. అది రామ్ చరణ్ వ్యక్తిత్వానికి నిదర్శనం.

Ram Charan With Satya

సత్యను సొంత ఫ్లైట్ లో తీసుకురావడం

రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో #RC15 సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా అమృత్ సర్ లో షూటింగ్ జరుపుకుంటున్న టైం లో ఈ సినిమాలో చరణ్ కి సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యి హైదరాబాద్ కి తిరిగి రావాల్సి ఉంది. ఎన్నో సినిమాలతో సుపరిచితమైన కమెడియన్ సత్య #RC15 లో నటిస్తున్నాడు. సత్య సన్నివేశాలు కూడా పూర్తయ్యి హైదరాబాద్ కి రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్, సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్ కి తీసుకుని వచ్చారు.

ఎంతో స్టార్ డం సంపాదించిన మెగా వారసుడి మంచి మనసు ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కమెడియన్ సత్య మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని, ఈ విషయం తెలుసుకున్న చరణ్ గతంలోనే రంగస్థలం సినిమాలో సత్య కి ఒక అవకాశం కల్పించాడు. ఆ తరువాత ఏకంగా తనతో ప్రయాణం చేసే అవకాశం కల్పించిన చరణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. చరణ్ గోల్డ్ స్పూన్ తో పుట్టాడు అంటారు. కాదు చరణ్ గోల్డ్ హార్ట్ తో పుట్టాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు