Prakash Raj: ప్రకాష్ రాజ్ ఫస్ట్ వైఫ్ గురించి తెలియని నిజాలు..!

Prakash Raj.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ రాజకీయాల పైన కూడా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్త ల్లో నిలుస్తున్నారు.. అలాగే మా ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేసి వార్తల్లో నిలిచిన ఈయన సినిమాలతో పాటు రాజకీయ పార్టీల పైన కూడా విమర్శలు గుప్పించి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు.. ఇకపోతే ఈయన సినిమా జీవితం అందరికీ తెలుసు కానీ ఈయన వ్యక్తి గత జీవితం మాత్రం ఎవరికీ తెలియదని చెప్పాలి.. ప్రకాష్ రాజ్ రెండో వివాహం కూడా చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రకాష్ రాజ్ మొదటి భార్య ప్రేమ, పెళ్ళి..

Prakash Raj: Unknown facts about Prakash Raj's first wife..!
Prakash Raj: Unknown facts about Prakash Raj’s first wife..!

ఇక ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే .. లలితా కుమారుని వివాహం చేసుకున్నారు కానీ 2009లో విడాకులు తీసుకోవడం జరిగింది.. ఇక మరుసటి సంవత్సరమే ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మాను వివాహం చేసుకోగా.. వీరికి ఒక అబ్బాయి కూడా జన్మించారు.. ఇదిలా ఉండగా దీనిపై తమిళ సెలబ్రిటీ జయంతి కన్నప్ప ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. లలిత కుమారి ప్రముఖ తమిళ నటి డిస్కో శాంతికి స్వయానా చెల్లెలు అవుతుంది.. లలిత చెన్నైకి వచ్చే ఆర్టిస్టులకు ఉండేందుకు ఏర్పాట్లు చేసేవారు.. అలా ప్రకాష్ రాజ్ కూడా కర్ణాటక నుంచి అవకాశాలు కోసం చెన్నైకి రావడంతో.. ఆయనకి కూడా ఉండడానికి ఆమె సహాయం చేసింది.. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి .. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు.. అలా 1994 లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లలిత కుమారి, ప్రకాష్ రాజ్ చాలా సంతోషంగా ఉండేవారు.. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించగా.. దురదృష్టవశాత్తు 2004 లో ప్రకాష్ రాజ్ కుమారుడు సిద్ధు మేడపై నుంచి పడి కన్నుమూశారు.

మొదటి భార్యతో విభేదాలు అందుకే..

ఇక కొడుకు విషయంలో అటు లలిత ఇటు ప్రకాష్ రాజ్ మధ్య విభేదాలు వచ్చాయి.. అదే సమయంలో ప్రకాష్ జీవితంలోకి పోనీ వర్మ వచ్చిందని జయంతి కన్నప్ప వివరించారు.. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.. దీనికి అభ్యంతరం చెప్పలేదు లలిత .. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్న తాను అంగీకరిస్తాను అని చెప్పింది. ఇక విడాకుల తర్వాత పిల్లల బాధ్యతను ప్రకాష్ రాజ్ స్వయంగా తీసుకున్నారు.. పిల్లలను ప్రకాష్ విదేశాలకు పంపించాడు..

- Advertisement -

పోనీ వర్మతో వివాహం..

ఆ తర్వాత ప్రకాష్ రాజ్, పోనీ వర్మ 2017 లో వివాహం చేసుకున్నారు .. ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు జన్మించారు.. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు.. ఇక పోనీ వర్మ కూడా ప్రకాష్ రాజ్ మొదటి భార్య పిల్లలతో కలిసి పోతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రకాష్ రాజ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు