Indian2 : రెండింటికీ ఇంత గ్యాపా? మధ్యలో చరణ్ ఇరుక్కున్నాడా?

Indian2 : కోలీవుడ్ స్టార్ లోక నాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు2 (ఇండియన్2) షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా నాలుగేళ్ళ కిందటే మొదలైనా, షూటింగ్ పలు కారణాల వల్ల ఆగిపొయి మళ్ళీ పట్టాలెక్కింది. తీరా ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకునేసరికి మళ్ళీ ఏవో ఒక అవంతరాలు వస్తున్నా, పట్టు వదలకుండా శంకర్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే భారతీయుడు 2 సినిమా ట్రైలర్ గాని, పాటలు గాని ఇప్పటివరకు మళ్ళీ రిలీజ్ అవలేదు. సినిమా రిలీజ్ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడగా, ఇంకా వాయిదా వేసుకుంటూ పోతే సినిమాపై ఉన్న అంచనాలు తగ్గిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా రానున్న నెల రోజుల్లోగా ఇండియన్2 షూటింగ్ మొత్తం పనులు పూర్తి చేసి, ప్రమోషన్లపైనే మొత్తం ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇండియన్ 2 గురించి తాజాగా కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇండియన్2 ,3 ఇదే ఏడాది వస్తాయి!

ఇక శంకర్ దర్శకత్వంలో ఇండియన్2 (Indian2) షూటింగ్ పూర్తవగానే గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలవుతుందని అందరికి తెలిసిందే. అయితే ఇండియన్ 2 కి మూడో భాగం కూడా తెరకెక్కుతోందని చాలా మందికి తెలీదు. ఆ మూడో భాగం షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్ల గురించి కమల్ హాసన్ నుండి తాజా అప్డేట్ వచ్చింది. ఇక ఇండియన్2 జూలై లో ఈ చిత్రం 11 లేదా 17 రిలీజ్ అవుతుంది అని కొన్ని వార్తలు అయితే ఆ మధ్య వచ్చాయి. అయితే ఇప్పుడు వీటిలో ఓ డేట్ ని అయితే మేకర్స్ లాక్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జూలై 17న గ్రాండ్ గా ఇండియన్ 2 పాన్ ఇండియన్ భాషల్లో విడుదల కానుందట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆల్రెడీ శంకర్, కమల్ లు ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టేసారు. మరి ఈ క్రమంలో ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Kamal Haasan gave interesting comments on Indian 2, Part 3 movies

- Advertisement -

 

రెండు భాగాలకు గ్యాప్? మధ్యలో చరణ్ సినిమా!

తాజాగా కమల్ హాసన్ చెన్నై, బెంగుళూర్ మ్యాచ్ సందర్బంగా స్పోర్ట్స్ ఛానల్ లో పాల్గొనగా, ఇండియన్2, 3 సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇండియన్ 2 రిలీజైన 6 నెలల తర్వాత ఇండియన్ 3 కూడా థియేటర్ల లోకి వస్తుంది అని అన్నారు. అలాగే శంకర్ ఇండియన్ 3 స్క్రిప్ట్‌ను కూడా తనకు అప్పుడే వివరించాడని, అది తనను బాగా ఆకట్టుకుందని, అందుకే పార్ట్ 3 కి కూడా ఓకే చెప్పినట్లు తెలిపారు. ఇక ఇండియన్ 2 యొక్క గ్రాండ్ ఆడియో లాంచ్ జూన్ 1వ తేదీన జరుగుతుందని ధృవీకరించారు. కథ పెద్దది కాబట్టి మూడు గంటల్లో చెప్పలేమని అందుకే, మూడో భాగాన్ని రూపొందించామని దర్శకుడు శంకర్ తెలిపారు. అయితే ఇండియన్ పార్ట్ 2 కి మూడో భాగానికి మధ్యలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ చివర్లో లేదా, అక్టోబర్ చివర్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు