Jr NTR – Prashanth Neel Movie : తారక్ ఫ్యాన్స్ కు షాక్… ఎన్టీఆర్, నీల్ మూవీ టైటిల్ అది కాదు

Jr NTR – Prashanth Neel Movie : శాండల్‌వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మూవీ ఇంకా స్టార్ట్ కాకముందే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారనే వార్త గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కానీ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి అందరూ అనుకున్న టైటిల్ కాదనే క్లారిటీ వచ్చింది తాజాగా ఓ నిర్మాత చేసిన ప్రకటనతో. ఇప్పుడు అదే టైటిల్ తో మరో సినిమా తీస్తున్నట్లు ఓ నిర్మాత ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్. అసలు విషయంలోకి వెళ్తే…

ఎన్టీఆర్- నీల్ సినిమా టైటిల్

జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైటిల్ పర్ఫెక్ట్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తారక్ అభిమానులకు షాక్ ఇచ్చేలా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

అదే టైటిల్ తో తమిళ సినిమా అనౌన్స్మెంట్

తమిళ నిర్మాత అశ్వత్ మరిముత్తు డ్రాగన్ అనే కొత్త సినిమా చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమా కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీతో నడుస్తుంది. ఇక తాజాగా తమిళ ప్రొడ్యూసర్ ప్రకటనతో ఎన్టీఆర్ సినిమా గురించి వచ్చిన వార్తలన్నీ ఫేక్ అనే క్లారిటీ వచ్చేసింది. కానీ అందరూ అనుకుంటున్నట్టుగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ అయితే… తాజాగా తమిళ నిర్మాత టైటిల్ అనౌన్స్మెంట్ పై ఎన్టీఆర్, నీల్ చిత్ర బృందం తదుపరి నిర్ణయం ఏమిటన్నది అభిమానుల ముందున్న ప్రశ్న.

- Advertisement -

ప్రశాంత్ నీల్ నెక్స్ట్ స్టాండ్ ఏమిటి?

నిజంగానే ఎన్టీఆర్-ప్రశాంత్ సినిమాకు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అయితే… జూనియర్ ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుండడంతో టైటిల్ రిలీజ్ టైంలో ఇదో పెద్ద సమస్యగా మారుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ టైటిల్ మారుస్తాడో లేదో వేచి చూడాలి. ఎన్టీఆర్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందనే వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో… తమిళ నిర్మాత ఇప్పటికే టైటిల్ ను రిలీజ్ చేసేశారు.

ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా అప్ డేట్!

మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో రాబోయే చిత్రం గురించి మేకర్స్ పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించబోతున్నట్టుగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ పుట్టినరోజున టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా ప్రకటిస్తారని అభిమానులు భావిస్తున్నారు. దాని గురించే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మేకర్స్ ఈ అప్డేట్ గురించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఒకవేళ టైటిల్ అనౌన్స్మెంట్ వస్తే అప్పుడు ఈ కన్ఫ్యూజన్ కు తెర పడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు