Anushka Sharma: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.!

Virat Kohli, Anushka Sharma get emotional as RCB secures spot in playoffs: ఇండియన్ ప్రీమియర్ 2024 టోర్నమెంటులో భాగంగా శనివారం రోజున కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ లో అదరగొట్టిన బెంగళూరు జట్టు… చిన్నస్వామి స్టేడియంలో తొడ కొట్టింది.

27 పరుగుల తేడాతో చెన్నై పై గెలిచిన బెంగళూరు జట్టు.. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్లే ఆఫ్ స్థానాన్ని సంపాదించుకుంది. వరసగా ఆరు మ్యాచులు విజయం సాధించిన బెంగళూరు… నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం… బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ ఎమోషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వీరిద్దరూ మ్యాచ్ విజయం తర్వాత… ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఇటీవల విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికే ఈ జంటకు వామిక అనే కూతురు ఉండగా ఇప్పుడు మగ బిడ్డ పుట్టాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మ్యాచ్‌ లో విరాట్‌ కోహ్లీ 47 పరుగులు చేసి రాణించాడు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు