Shakalaka Shankar: పవన్ కు ఓటమి అలవాటే.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Shakalaka Shankar.. జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న షకలక శంకర్ ఈమధ్య సినిమాలలో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకలక శంకర్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి..

పవన్ కళ్యాణ్ కు ఓటమి అలవాటే..

Shakalaka Shankar: Pawan is used to losing.. Shocking comments go viral..!
Shakalaka Shankar: Pawan is used to losing.. Shocking comments go viral..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి షకలక శంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కెరియర్ లో అపజయాలు చాలా ఎక్కువ.. సినిమా రంగంలో.. రాజకీయ రంగంలో కూడా ఆయన ఎన్నో ఫెయిల్యూర్స్ ని చవిచూశారు.. అలా పవన్ కళ్యాణ్ కి ఓటమి అలవాటైపోయింది.. ఇక ఆయన గెలిచినా..ఓడిపోయినా.. పెద్దగా తేడా ఏమీ ఉండదు అంటూ.. షకలక శంకర్ కామెంట్ చేశారు.. ఇక అపజయాలు విజయానికి సంకేతం.. పవన్ కు విజయం దక్కుతుందని.. పవన్ ను చూసి అపజయం కూడా భయపడుతుంది అని షకలక శంకర్ కామెంట్లు చేశారు.. ఎన్నో ప్లాప్ ల తర్వాత గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయింది.. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఆయన ఎన్నో పరాజయాలు చూసిన తర్వాత కచ్చితంగా మంచి మెజారిటీతో గెలుపొందుతారు అంటూ కామెంట్లు చేశారు..

వంద మందిలో ప్రథమ స్థానం..

అలాగే చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ.. ఇండియాలో వంద మంది హీరోలు ఉంటే వారిలో సినిమా కోసం శ్రమించి.. సినిమాయే జీవితంగా బ్రతుకుతున్న వారిలో చిరంజీవి ఉంటారు.. ఆయన నటించే ప్రతి సినిమాలో కూడా ఆయన కష్టం తప్పకుండా కనిపిస్తుంది.. అంటూ తెలిపారు..

- Advertisement -

ఆయన వల్లే ఇండస్ట్రీలో కొనసాగుతున్నా..

తన గురించి మాట్లాడుతూ.. నేను కోన వెంకట్ వల్లే ఇప్పటికీ యాక్టర్ గా కొనసాగుతున్నాను.. నాకు గుర్తింపు ఇచ్చిన జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పి ఇప్పుడు సినిమాలలోకి వచ్చాను అంటూ షకలక శంకర్ తెలిపారు.. ఇక షకలక శంకర్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి కామెంట్లు చేయడంతో ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయాలను పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.

పవన్ కళ్యాణ్ సినిమాలు..

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. రాజకీయంగా తన జీవితాన్ని మరింతగా మార్పు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు కూటమిలో కలిపేసి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.. ఆ ప్రాంతంలో గెలుపొందారో లేదో తెలియాలి అంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం జూన్ 4 ఎన్నికల ఫలితాలు తర్వాత ఆయన నటిస్తున్న సినిమాలు తిరిగి పునః ప్రారంభం కానున్నాయి.. ఉస్తాద్ , హరిహర వీరమల్లు, OG సినిమా షూటింగ్లలో తిరిగి పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్. ముందుగా హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు