Eesha Rebba: పెళ్లి గురించి ఓపెన్ అయిన ఈషా రెబ్బా..!

Eesha Rebba.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది.. కానీ అవేవీ వర్కౌట్ కాకపోవడంతో సెకండ్ హీరోయిన్ పాత్రలకి పరిమితం అవుతూ వస్తోంది.. అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాలో ఏకంగా ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ గా అవకాశాన్ని సొంతం చేసుకుంది.. అటు అభినయంతో ఇటు అందంతో పూజా హెగ్డే తో పోటీపడి మరీ నటించినా.. ఈ తెలుగు అమ్మాయి మంచి క్రేజ్ సొంతం చేసుకోవాల్సి ఉంది కానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమెకు పెద్దగా స్క్రీన్ ఇవ్వలేదని చెప్పాలి.. దీనికి కారణం ఒక తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ వల్ల అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

పెళ్లి పై క్లారిటీ..

Eesha Rebba: Eesha Rebba is open about marriage..!
Eesha Rebba: Eesha Rebba is open about marriage..!

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన లవ్ రిలేషన్స్ గురించి, ఫాస్ట్ బ్రేకప్స్ గురించి కూడా స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈషా రెబ్బా..ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకి పెళ్లిళ్లు ఎందుకు అంత త్వరగా అవ్వవు అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ.. తాను ఎదుర్కొన్న పరిస్థితులను అలాగే రిలేషన్స్ గురించి.. పెళ్లి గురించి కూడా తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకుంటాను అంటే మా నాన్న మాట్రిమోనీలో పెడతా అన్నారు.. వినడానికి క్యూట్ గా ఉంది కానీ అది వర్కౌట్ కాదని చెప్పాను.. ఎందుకంటే మిగతా ఉద్యోగాలు, వృత్తులలో ఉన్న వారిని పెళ్లి చేసుకున్నట్టు ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదు..

ఇండస్ట్రీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం సులభం కాదు..

ముఖ్యంగా వారిని అర్థం చేసుకోవాలి.. వారితో కలిసి ట్రావెల్ చేయాలి.. భరోసా ఇవ్వాలి.. సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొనే సమస్యల గురించి అతడికి పూర్తి అవగాహన ఉండాలి.. అప్పుడే వివాహం చేసుకోవడానికి వీలు ఉంటుంది.. లేకపోతే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే రిలేషన్స్ లో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉంటాయి.. అందుకే ఇండస్ట్రీ అమ్మాయిలను బయట వ్యక్తులు వివాహం చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు అంటూ తెలిపింది ఈషా రెబ్బా. ఇక గతంలో కూడా తాను రిలేషన్ లో లేనని.. చెబితే అది అబద్దమే.. రిలేషన్ లో ఉన్నా కూడా అవి రాంగ్ రిలేషన్స్ అని తెలిసిందని ఆమె తెలిపింది..

- Advertisement -

త్వరగా నమ్మడమే నా వీక్నెస్..

అంతే కాదు ఆమె మాట్లాడుతూ ఎవరినైనా సరే త్వరగా నమ్మేస్తాను.. తర్వాత వారితో ట్రావెల్ అయితే నిజస్వరూపాలు బయటకు వస్తాయి.. వారిలో ఉండే రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి.. వాటి నుంచి స్మూత్ గా ఎస్కేప్ అవడం చాలా కష్టం అంటూ ఆమె చెప్పుకు వచ్చింది . ఇక గతంలో తాను కూడా రాంగ్ రిలేషన్స్ లో ఉన్నానని .. కానీ అవన్నీ వదిలేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా విడిపోవడానికి చిన్న చిన్న సమస్యలే రిలేషన్ లో ఉన్నప్పుడు పెద్దగా అనిపిస్తాయి.. వాటిని బయటకు కూడా చెప్పుకోలేము.. అందుకే దూరంగా ఉండటం కోసం బ్రేకప్ చెప్పుకోవడమే బెటర్ అంటూ తెలిపింది ఈషా. ఇకపోతే ప్రస్తుతం తనకు పెళ్లి అంటేనే భయం అని.. ఆ పదం వింటే పారిపోవాలనిపిస్తోందంటూ కూడా చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు