HBD Jr.NTR: అవమానాల నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు వరకూ..!

HBD Jr. NTR.. నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నేడు ఆయన గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకోవడం వెనుక.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవడమే ప్రధాన కారణమని చెప్పవచ్చు.. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆయనను దూషించిన వారే నేడు ఆయన చెంతకు చేరి ఆయనను పొగుడుతుంటే ఆయన రేంజ్ ఎంత స్థాయికి ఎగబాకిందో అర్థం చేసుకోవచ్చు.నిజానికీ నందమూరి హరికృష్ణ.. తన కుటుంబ సభ్యులను కాదని షాలినితో లివింగ్ రిలేషన్ లో ఉన్నారని.. ఆమెను రహస్యంగా వివాహం చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ కు జన్మనిచ్చారని సమాచారం.. ఈ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతూ వచ్చింది.. ఇప్పటికీ కూడా ఈయనను తమ కుటుంబంలో కలుపుకోలేదనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు సినీ పరిశ్రమ లోకి వచ్చిన కొత్తలో శరీర ఆకృతి పై కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. భారీ కాయం ఉండడంతో విమర్శలు రాగా సర్జరీ చేయించుకొని సన్నగా అయిపోయారు జూనియర్ ఎన్టీఆర్..

శరీర ఆకృతి పై విమర్శలు..

HBD Jr.NTR: From insults to global recognition..!
HBD Jr.NTR: From insults to global recognition..!

ఇకపోతే గతంలో శరీర ఆకృతిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈయన నేడు పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తనను విమర్శించిన వారి నోటే ప్రశంసలు అందుకుంటూ భారీ స్టార్ డం ను సొంతం చేసుకున్నారు.

రాజమౌళి డైరెక్షన్ లోనే ఎక్కువ సినిమాలు..

HBD Jr.NTR: From insults to global recognition..!
HBD Jr.NTR: From insults to global recognition..!

1983 మే 20వ తేదీన జన్మించిన ఎన్టీఆర్ 40 సంవత్సరాలు పూర్తిచేసుకుని 41 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఇక నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ .. తన తాత సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలలో బాల నటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టారు.. ఇక తర్వాత అత్యధికంగా రాజమౌళితోనే సినిమాలు చేయడం విశేషం. సింహాద్రి, యమదొంగ వంటి చిత్రాలతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన.. 2021లో ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. అంతే కాదు ఈ సినిమాతో పలు అవార్డులను కూడా దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్..

- Advertisement -

కుటుంబం..

ఈయన కుటుంబం విషయానికి వస్తే.. ఈయన భార్య లక్ష్మీ ప్రణతి.. ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కూడా ఉన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు..

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అన్నీ పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టగా.. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేసి దేవర 2 సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇకపోతే ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవరా సినిమా నుంచి ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేశారు.. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు