Shoot begins from August 2024 NTRNeel: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకొని… టాలీవుడ్ ఇండస్ట్రినీ ఏలుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో బంపర్ హిట్ అందుకున్న… జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది.
అయితే దేవర సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకుడుతో కొత్త సినిమా చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ వచ్చేసాయి. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఉన్న నేపథ్యంలో…. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగు గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. అలాగే జూనియర్ ఎన్టీఆర్కు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Happy Birthday to the ‘MAN OF MASSES’ @tarak9999 ❤🔥
-Team #NTRNeel
Shoot begins from August 2024.
Brace yourself for a powerhouse project 🔥#HappyBirthdayNTR#PrashanthNeel @MythriOfficial pic.twitter.com/HimcwrZh8V
— NTR Arts (@NTRArtsOfficial) May 20, 2024
NTR31 మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ చేయాల్సిన కేజీఎఫ్ 3, సలార్ 2 సినిమాలు ఇప్పట్లో లేవని అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ – తారక్ మూవీ కంప్లీట్ అయ్యకే ఈ రెండు భారీ సినిమాలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.