HBD Manchu Manoj : మంచు వారి మంచి ముత్యం మనోజ్..!

HBD Manchu Manoj : టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుండి వచ్చిన వారసుల్లో “మంచు మనోజ్” ఒకరు. తండ్రి వారసత్వంతో వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన పేరుని తెచ్చుకున్నాడు. నటన కోసం ఎంతైనా కష్టపడే టాలెంటెడ్ నటుల్లో “మంచి మనోజ్” ఒకరు. పేరుకి మంచు వారసుడే అయినా ఎక్కడా గర్వం చూపించాడు. ఇండస్ట్రీ లో ఎంతో ఎంతో స్నేహంగా ఉండే హీరోల్లో మంచు మనోజ్ ముందు వరుసలో ఉంటాడు. తనకంటే పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా ఒకే రకంగా చూస్తూ అందరితోనూవు కలిసిపోయే వ్యక్తిత్వం మంచు మనోజ్ ది. ఇక సినిమా ఇండస్ట్రీ లో తన సినిమాల విషయానికి వస్తే.. ఎన్ని సినిమాలు చేశామని కాదు. ప్రేక్షకులకు ఎంత గుర్తుండిపోయాము అనేది ఫాలో అవుతానని మంచు మనోజ్ పలు మార్లు చెప్పుకొచ్చాడు. ఇక రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు గుర్తుండేవి, ముఖ్యంగా నటన పరంగా చెప్పుకొదగ్గ బెస్ట్ మూవీస్ చేసాడు మంచు మనోజ్.

HBD Manchu Manoj Birth day special

ప్రయోగాలకు కేరాఫ్..

ఇక మంచు మనోజ్ మంచు ఫ్యామిలీ లో తన తండ్రి, అన్న లా కాకుండా తన కంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడని చెప్పాలి. దానికి తాను నటించిన సినిమాల సెలక్షన్ కూడా కారణమని చెప్పొచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినపుడే మంచి నటనను కనబరిచిన మనోజ్, ఆ తర్వాత హీరోగానూ చెప్పుకోతగ్గ చిత్రాలు చేసాడు. రాజు భాయ్, ప్రయాణం, బిందాస్, వేదం, మిస్టర్ నూకయ్య, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాల్లో మంచు మనోజ్ ఉత్తమ నటనని కనబరిచాడు. ఈ సినిమాల్లో కొన్ని అంతగా ఆడకపోయినా టాలీవుడ్ లో క్లాసిక్ మూవీస్ గా నిలిచిపోయాయి. అయితే ఒక్కడు మిగిలాడు సినిమా తరువాత మంచు మనోజ్ కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యాడు. ఆ తరవాత పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు లైఫ్ గడిపి ఇప్పుడు “మిరాయ్” సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే అంతకు ముందే ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో ఓ సినిమా మొదలు పెట్టినా పట్టాలెక్కలేదు.

- Advertisement -

మంచు ఫ్యామిలీ ముత్యంగా..

ఇక టాలీవుడ్ లో ఉన్న బడా ఫ్యామిలీలో ఒకటి మంచు ఫ్యామిలీ. అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే మంచు మోహన్ బాబు ఫ్యామిలిలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. మోహన్ బాబుకి ఉన్న గర్వం ఏపాటిదో తెలిసిందే. అదే తీరుగా మంచు విష్ణు మోహన్ బాబు ఉంటారని అంటూ ఉంటారు. ఇక వీళ్ళ సినిమాలు చూస్తేనే వాళ్ళ నటనా ప్రతిభ ఏ పాటిదో తెలిసిపోతుందని నెటిజన్లు అంటుంటారు. కానీ మంచు మనోజ్ మాత్రం మంచు ఫ్యామిలీ లో మంచి అబ్బాయ్ గా, మంచు ముత్యం లా ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. పలానా సమయంలో ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే ముందుండే హీరోల్లో మంచు మనోజ్ ఒకరు. ఇక మోహన్ బాబు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, స్టార్ డమ్ దక్కకున్నా, నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మనోజ్ ఇప్పుడు తన రీ ఎంట్రీ లో సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈరోజు మంచు మనోజ్(HBD Manchu Manoj) (మే 20) పుట్టినరోజు. ఈ సందర్బంగా తనకి ఫిల్మిఫై తరపున బర్త్ డే విషెస్ ని అందచేస్తూ రీ ఎంట్రీ లో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు