Hema -Bangalore Rave Party: అడ్డంగా దొరికిపోయిన యాక్టర్ హేమ..!

Hema -Bangalore Rave Party.. సెలబ్రిటీలు నిత్యం ఏదో ఒక రేవు పార్టీలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు.. అయితే ఒక్కొక్కసారి పోలీసులకు అనుమానం వస్తే మాత్రం అడ్డంగా దొరికిపోతారని చెప్పవచ్చు.. ఇలా నిత్యం రేవ్ పార్టీలు జరిగే ప్రాంతాలలో బెంగళూరులో కూడా ఒకటి..ఇక్కడ నిత్యం ఏదో ఒక చోట రేవ్ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న జి ఆర్ ఫామ్ హౌస్ లో బర్తడే పేరుతో రేవ్ పార్టీ జరగగా.. ఆ పార్టీ పై పోలీసులు, యాంటీ నార్కోటిక్ విభాగం అధికారులు సంయుక్తంగా దాడి చేయగా.. పలువురు సెలబ్రిటీలు దొరికినట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే తెలుగు నటి హేమ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు..

రేవ్ పార్టీలో హేమ..

Hema -Bangalore Rave Party: Actor Hema who was caught in the crossfire..!
Hema -Bangalore Rave Party: Actor Hema who was caught in the crossfire..!

ఈ పార్టీలో పాల్గొన్న యువకులు డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎండిఎంఏ మాత్రలు, కొకైన్ పెద్ద మొత్తంలో లభ్యమయ్యాయి. ఆంధ్ర బెంగళూరుకు చెందిన మొత్తం వందమందికి పైగా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. వీరిలో 25 మందికి పైగా యువతులే ఉన్నారు. మరి రేవ్ పార్టీలో పాల్గొనాలని ఎవరైనా ఆహ్వానిస్తే నటి హేమ అక్కడికి వెళ్లారా? లేక డబ్బులు తీసుకొని రేవు పార్టీలో పాల్గొన్నారా ? పని కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు..

ఆహ్వానం మేరకు వచ్చిందా..

ఆదివారం అర్ధరాత్రి తర్వాత కూడా ఈ పార్టీ కొనసాగిందని విచారణలో తేలింది.. ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ రేవ్ పార్టీ నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారట.. అయితే అర్ధరాత్రి తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి దీన్ని భగ్నం చేశారు.. ముఖ్యంగా ఇలాంటి రేవ్ పార్టీల కోసం ఒక్క రోజుకు దాదాపు రూ.30 లక్షల నుండి రూ.50 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలకు ఎక్కువగా మోడల్స్ తో పాటు హీరోయిన్లు కూడా వస్తూ ఉంటారు.. ఇందుకు వారికి భారీగా పారితోషకం కూడా చెల్లిస్తూ ఉంటారు.. ఇప్పుడు ఈ క్రమంలోనే నటి హేమ కూడా వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు..

- Advertisement -

2022 లో అడ్డంగా దొరికిపోయిన హేమ..

ఇకపోతే 2022లో కూడా హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో రాడిసన్ డ్రగ్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది.. అప్పట్లో కూడా ఆదివారం రాత్రి టైంలోనే పుడింగ్ పబ్లో విచ్చలవిడిగా డ్రగ్ తో పాటు కొకైన్ తీసుకున్నట్లు పక్క ఆధారాలతో పోలీసులు నిరూపించారు. 150 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇందులో 39 మంది యువతులు ..వారిలో కొంతమంది ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, మాజీ డిజిపి కుమార్తె తో సహా పలువురు ఉన్న విషయం తెలిసింది..అయితే అప్పట్లో కూడా నటి హేమా పేరు హల్చల్ చేసింది.. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో తాను ఉన్నట్లు పుకార్లు సృష్టించి తన ప్రతిష్ట దిగజారేలా మీడియా కథనాలు సృష్టిస్తోంది అంటూ ఆమె చిందులు వేశారు… అంతేకాదు తన పేరు లేకపోయినా.. తాను పబ్లో కనిపించకపోయినా తన పేరు ఎందుకు బయటకు తీశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇప్పుడు మళ్లీ ఈ బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పేరు వాడడంతో దీనిపై హేమ ఎలా రియాక్ట్ అవుతుందో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో తన పేరు బయటకు వినిపించడంతో హేమ స్పందించింది.. ఎవరో కావాలని ఫేక్ వీడియో క్రియేట్ చేశారని.. తాను అసలు అక్కడికి వెళ్ళలేదని క్లారిటీ ఇచ్చింది హేమ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు