HBD Manchu Manoj: మంచు మనోజ్ సినీ ప్రస్థానం.. !

HBD Manchu Manoj.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచు కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఆ గౌరవాన్ని మరింత రెట్టింపు చేయడంలో మంచు మనోజ్ ఎప్పుడూ ముందుంటారనటంలో సందేహం లేదు.. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్నేహితులను కలిగి ఉన్న ఈయన అంతకుమించి అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనోజ్ సినీ ప్రస్థానం ఎలా మొదలయింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. మరి ఈరోజు ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా మనోజ్ సినీ ప్రయాణం..

HBD Manchu Manoj: Manoj film journey
HBD Manchu Manoj: Manoj film journey

1983 మే 20న మంచు మోహన్ బాబు, నిర్మలాదేవి దంపతులకు జన్మించారు మంచు మనోజ్.. హీరో కాకముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన తండ్రి మోహన్ బాబు నటించిన పలు చిత్రాలలో నటించిన మంచు మనోజ్.. అప్పట్లోనే కెమెరా ముందు ఎలా నటించాలనే విషయంపై ఎన్నో మెలుకువలు నేర్చుకున్నారు.. ఇప్పుడు హీరోగా 16 సంవత్సరాల నటన ప్రస్తానాన్ని కంప్లీట్ చేసుకున్నారు. మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాల విషయానికి వస్తే.. తన తండ్రి మోహన్ బాబు హీరోగా.. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మ సినిమా ద్వారా బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

దొంగ దొంగది చిత్రం ద్వారా హీరోగా ప్రయాణం..

ఆ తర్వాత కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, మోహన్ బాబు హీరోలుగా తెరకెక్కిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో కూడా బాల నటుడిగా నటించి తనదైన నటన ప్రదర్శించారు మంచు మనోజ్. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమా తర్వాత పుణ్యభూమి నాదేశం సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో బాల నటుడిగా నటించి మెప్పించారు మంచు మనోజ్. ఇక ఈ చిత్రాలే కాదు మోహన్ బాబు నటించిన అడవిలో అన్న సినిమాలో కూడా మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.. ఇక ఈయన హీరో గా దొంగ దొంగది చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో హీరోయిన్గా సదా నటించింది.. వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు..

- Advertisement -

నిర్మాతగా కూడా కెరియర్ మొదలు..

మోహన్ బాబు నట వారసుడిగా సినిమా ఎంట్రీ ఇచ్చి.. నటుడిగా ప్రూవ్ చేసుకున్నా.. సరే హీరోగా స్టార్డం మాత్రం లభించలేదు.. విభిన్న చిత్రాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు మంచు మనోజ్. మాస్ హీరోగా వరుస అవకాశాలు ఉన్నా కూడా సక్సెస్ మాత్రం ఈయనను వరించలేదు.. ప్రస్తుతం “అహం బ్రహ్మాస్మి ” సినిమాలో నటిస్తున్నారు.. దాదాపు మూడేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత ఈ కథను ఓకే చేశారు. ఈ సినిమాతో హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా అవతారం ఎత్తారు.. మరి చాలా రోజులుగా ఈ సినిమా సెట్ పైనే ఉంది కానీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఎన్టీఆర్ బర్త్డే కూడా..

ఇకపోతే ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే కూడా.. ఇక వీరిద్దరూ కూడా మంచి స్నేహితులే.. పలు సందర్భాలలో వీరిద్దరూ కలిసి పార్టీలలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే భూమా మౌనిక ను వివాహం చేసుకున్న ఈయనకు పండంటి కూతురు జన్మించింది. ఇక ప్రస్తుతం కొడుకు కూతురుతో ఈ జంటని సంతోషంగా ఉన్నారు. ఇక ఈరోజు మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు