Allu Arjun : డైరెక్టర్స్ డే పై మెగా – అల్లు వివాదం ఎఫెక్ట్… డుమ్మా కొట్టిన టాప్ హీరో…?

Allu Arjun: దివంగత దర్శకులు.. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ దర్శకులు అందరూ కలిసి దర్శకుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.. కనీ విని ఎరుగని లేతిలో కేవలం టాలీవుడ్ లో మాత్రమే ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. ఇక అందులోనూ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ఈ దర్శకుల దినోత్సవం చాలా ఘనంగా జరిగింది.

దర్శక దినోత్సవానికి హాజరైన ప్రముఖులు..

Allu Arjun : Mega Controversy Effect on Director's Day - Allu Arjun... Dumma Kotta Top Hero...?
Allu Arjun : Mega Controversy Effect on Director’s Day – Allu Arjun… Dumma Kotta Top Hero…?

ఇక ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ , విజయేంద్ర ప్రసాద్, హరీష్ శంకర్, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, వంశీ పైడిపల్లి, వేణు ఎల్దండి , ఎన్.శంకర్, ఎస్. వి.కృష్ణారెడ్డి , నాని, చంద్రమోహన్, మారుతి , శ్యామలాదేవి, అల్లరి నరేష్, ఆనంద్ దేవరకొండ, అడవి శేషు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.. ఇకపోతే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అల్లు అర్జున్ మాట్లాడుతూ దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా దర్శక దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది అంటూ అల్లు అర్జున్ తెలిపారు..

అల్లు అర్జున్ రావడంతో చిరంజీవి డుమ్మా..

ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంపై అభిమానులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు ..అసలు విషయంలోకెళితే ఈ దర్శకుల దినోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వస్తారంటూ వార్తలు వినిపించాయి. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నట్లు వార్తలు రావడంతో.. చిరంజీవి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.. అయితే ఇలా ఉన్నట్టుండి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాల్సిన వ్యక్తి డుమ్మా కొట్టడం వెనుక కారణం అదే అని తెలుస్తోంది..

- Advertisement -

మేనమామను కాదని స్నేహితుడి కోసం ప్రచారం..

గత కొన్ని రోజులుగా అల్లు – మెగా కుటుంబం మధ్య ఎవరికీ తెలియని కోల్డ్ వార్ జరుగుతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక గత వారం నుంచి మరో వివాదం తెరపైకి వచ్చింది.. అసలు విషయంలోకెళితే.. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసుకున్నారు. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన మేన మామ పవన్ కళ్యాణ్ ను కాదని.. వైసిపి నంద్యాల అభ్యర్థి తన స్నేహితుడైన శిల్ప రవి కిషోర్ రెడ్డి కోసం తన భార్యతో కలిసి వెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నంద్యాలకు వెళ్లి ప్రచారం చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది..

విభేదాలు నిజమే అని క్లారిటీ ఇచ్చేసిన చిరంజీవి..

ఇక నాగబాబు ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మావాడైనా పరాయి వాడే.. మా కోసం పనిచేసేవాడు పరాయివాడైనా మా వాడే అంటూ ట్వీట్ చేశాడు.. దీంతో మెగా – అల్లు అభిమానుల మధ్య వివాదం రాజుకుంది.. దీంతో చిరంజీవి రంగంలోకి దిగి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చాడని సమాచారం.. దీంతో నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారు. మళ్ళీ మరుసటి రోజు తన ట్విట్టర్ ఖాతాను తెరిచి పోస్ట్ డిలీట్ చేశానంటూ క్లారిటీ ఇచ్చారు.. ఇలా అల్లు – మెగా ఫ్యామిలీ ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ దర్శక దినోత్సవానికి అల్లు అర్జున్ రావడంతో చిరంజీవి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.. ఏది ఏమైనా ఇలా చిరంజీవి రాకపోవడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు నిజమే అని ఒక క్లారిటీకి వస్తున్నారు నెటిజన్స్.

మొత్తానికి అయితే ఈ అల్లు – మెగా కుటుంబాల మధ్య ఉన్న గొడవల ఎఫెక్ట్ డైరెక్టర్స్ డే పైన పడిందని సినీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun FC (@allu_arjun0666)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు