Tapsee: పక్కనుంచి హీరోయిన్ వెళుతున్న పట్టించుకోని డెలివరీ బాయ్

Tapsee: తాప్సి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాతో మంచి గుర్తింపును సాధించుకుంది. దశరథ్ దర్శకత్వం వహించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఈమె క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారు ప్రభాస్ మైండ్ సెట్ కి సరిపోయే అమ్మాయిలా ఈ సినిమాలో కనిపించింది తాప్సి. అయితే తాప్సికి తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో, తాను చేసిన కొన్ని కామెంట్స్ వలన సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.

ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ

మంచు మనోజ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తాప్సి. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకొన్ని సినిమాలు చేసింది. అయితే ఒక తరుణంలో దర్శకులు రాఘవేంద్రరావు పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అక్కడితో తెలుగులో కూడా ఈమెకి ఆదరణ కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు.

తెలుగులో హిట్ సినిమాలు

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన సాహసం సినిమాలో గోపీచంద్ తోపాటు కనిపించి ఆ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత సంకల్ప రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘాజి సినిమా కూడా మంచి పేరును తీసుకొచ్చింది. ఇకపోతే మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఆనందోబ్రహ్మ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.

- Advertisement -

Taapsee Pannu

తాప్సీను పట్టించుకోలేదు

తాప్సికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఏమీ కాదు. ఎందుకంటే కేవలం తెలుగులో మాత్రమే ఆమె సినిమాలు చేయలేదు. మిగతా ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసింది. రీసెంట్గా డంకి సినిమాలో కూడా కనిపించింది. ఇకపోతే ముంబైలోని ఒక సెలూన్ నుంచి తాప్సి బయటకు వస్తుంది. ఈమె బయటికి వస్తే ఫొటోస్ తీద్దామని ఫోటోగ్రాఫర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక డెలివరీ బాయ్ ఫుడ్ ని పట్టుకొని ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. అయితే లోపల నుంచి తాప్సి వస్తుంది జరుగు అని ఫోటోగ్రాఫర్స్ చెబుతున్న కూడా ఏమీ పట్టనట్లు అలా నిలుచున్నాడు. ఆ తర్వాత ఎదురుగా తాప్సి వస్తున్న కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అయితే ఒక సెలబ్రిటీ బయట కనిపిస్తుంటే వాళ్ల మీద పడిపోతున్న తరుణంలో, ఆ డెలివరీ బాయ్ ఏమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవడంపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు