Harom hara: సుధీర్ బాబు “హరోం హర” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారిలో హీరో సుధీర్ బాబు ఒకరు. హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబాన్ని అండగా చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు సుదీర్ బాబు.

ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నాడు. అయితే ఈ మధ్య సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న టాలీవుడ్ హీరో సుధీర్ బాబు… ఇప్పుడు హరోం హర అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు. సేహరి ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక కథ అందిస్తున్నారు. ఈ సినిమా 1989 బ్యాక్ డ్రాప్ లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీ అని చెబుతున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా వస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా ను సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు భరద్వాజ్ మ్యూజిక్ అలాగే బ్యాక్ గ్రౌండ్ కూడా అందిస్తున్నాడు. ఏకంగా ఈ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి ప్రకటించారు.

- Advertisement -

వాస్తవానికి మే 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండేది.కానీ కొన్ని అనువార్య కారణాలవల్ల పోస్ట్ పోన్ చేశారు. జూన్ 14వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా లాంచ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు