Bangalore Rave Party : సభ్య సమాజానికి ఏమి మేసేజ్ ఇస్తున్నారు

తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలను తెలుగు సినీ నటులను ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలను చూసి ఇన్స్పైర్ కూడా అవుతుంటారు. అలానే కొంతమంది సినిమా వాళ్ళని చూసి కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మామూలుగా ఒక సినిమాను చూసి వచ్చినప్పుడు ఆ సినిమాలో హీరో వేసుకునే బట్టలు, హీరో వేసుకుని చెప్పులు కూడా వెతుక్కుని ఎన్నో షాపులు తిరిగి కొనుక్కునే అభిమానులు ఉన్నారు. అలానే తమ హీరో సేవా కార్యక్రమాలు చేస్తే తమ హీరో పేరు మీద అభిమానులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే సినిమాలలో నటించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్లను చూసి ఇన్స్పైర్ అవుతారు అన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. పూర్తిస్థాయిలో ఇన్స్పైర్ కాకపోయినా కూడా ఎంతో కొంత వాళ్ల నుంచి నేర్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి. వారి పర్సనల్ జీవితంలోని కొన్ని పనులు కచ్చితంగా కొందరి అభిమానులపై ప్రభావం చూపిస్తాయి.

పార్టీ కల్చర్

బేసిగ్గా తాగడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయానికి సంబంధించింది. అయితే ఆ అలవాట్లు అనేవి ఎక్కువ శాతం మందికి కూడా ఉంటాయి. ఆ అలవాట్లను బయట పెట్టకుండా తమకంటూ ఉన్న పర్సనల్ స్పేస్ లో, పర్సనల్ సర్కిల్స్ తో ఇంట్లో కూర్చోవడం వేరు. అదే అలవాట్లను పబ్స్ , రేవ్ పార్టీలులో బయట పెట్టడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ సమాజంలో ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా కూడా, మీడియా ఫోకస్ చేసేది, మీడియా చూపించేది కేవలం సెలబ్రెటీలును మాత్రమే. ఎందుకంటే చాలామందికి సినిమాలు ఎంత ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తాయో, సినిమా వాళ్ళ జీవితాలు కూడా అంతే ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తాయి. మామూలుగానే సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామందికి గౌరవం ఉండదు. అలాంటిది ఇలాంటి వాటిని మీడియా ఫోకస్ చేసి చూపిస్తే, సినిమా వాళ్లపై ఉన్న ఇంకాస్త గౌరవం కూడా దిగజారిపోతుంది.

డ్రగ్స్ కేస్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ కేస్ ఎంతటి సంచలనానికి దారితీసిందో మనకు తెలియనిది కాదు. తన సినిమాల్లో మీడియా రంగానికి ఎంతో గౌరవాన్ని ఇచ్చి, మీడియాను చాలా పవర్ఫుల్ గా చూపించిన పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడుని కూడా రోడ్డుకు లాగేసింది అప్పట్లో మీడియా. అక్కడితో చాలా మంది మీడియా ప్రముఖుల నంబర్లను కూడా డిలీట్ చేసేసాడు పూరి జగన్నాథ్. ఇకపోతే ఇప్పటికీ డ్రగ్స్ కేస్ విషయానికి వస్తే పేపర్ మీద అన్నిటికంటే ముందు ఓం అని రాసినట్టు నవదీప్ పేరుతో మొదలుపెడతారు. అయితే ఈ విషయంలో సరైన క్లారిటీ లేకపోయినా కూడా కొన్ని పేర్లను బయటకు తీస్తూ ఉంటారు. ఎందుకంటే పదిమందికి తెలిసిన వాళ్ళ గురించి ఒక విషయాన్ని చెబితేనే ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరికీ తెలియని ఫలానా వ్యక్తి గురించి చెప్తే ఎవరూ పట్టించుకోరు.

- Advertisement -

రేవ్ పార్టీ

ఇక రీసెంట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది రేపు పార్టీ. అయితే బెంగళూరులో రీసెంట్ గా జరిగిన రేవ్ పార్టీలో దాదాపుగా 71 మంది పురుషులు, 30 మంది మహిళలు పట్టుబడినట్లు సమాచారం. వారిలో చాలామంది వ్యక్తులు ఉన్నా కూడా సినీ, రాజకీయ ప్రముఖుల గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఇకపోతే ఈ పార్టీలో నటి హేమ ఉన్నట్లు ఫోటోలను కూడా రిలీజ్ చేశారు బెంగళూరు పోలీసులు. అయితే ఆ ఆ విషయం వాస్తవం కాదని నేను హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నాను అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది నటి హేమ. హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్సు, పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో కూడా ఒకటి డ్రెస్ లో ఉంది.

ఇకపోతే ఈ పార్టీలో సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సమాధానం ఇస్తూ రేవ్ పార్టీలో నేను లేను. రేవ్ పార్టీలకు పబ్బులకు వెళ్లే వ్యక్తిని నేను కాదు. తప్పుడు కథనాలు నమ్మకండి. బెంగళూరు రేవు పార్టీలో దొరికిన అతను ఎవరో కొంచెం నాలాగే ఉన్నాడు. అతడి కాస్త గడ్డం ఉంది మొహం కవర్ చేసుకున్నాడు నేనే షాక్ అయ్యాను. నేను హైదరాబాదులోనే మా ఇంట్లోనే ఉన్నాను అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇక జానీ మాస్టర్ కూడా “నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం.ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది.” అంటూ చెప్పుకొచ్చారు.

Bangalore Rave Party : What message is being given to the member community?

ఇకపోతే ఏదేమైనా ఈ పార్టీలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది చట్టం నిర్ణయిస్తుంది. కానీ సినిమా వాళ్లు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే వాళ్ళని నమ్ముకుని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా వాళ్ళని దైవంగా భావిస్తూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంతగా ప్రేమించే అభిమానులు కూడా బాధపెట్టే స్థితికి తీసుకురాకూడదు. నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నటులు ఈరోజు కి నిలబడ్డారు అంటే కారణం వాళ్ళు నడుచుకునే తీరు అని చెప్పొచ్చు. ఇదే తీరు సినిమా వాళ్ళ అందరిలో అంటే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచ సినిమా అంతా తెలుగు సినిమా వైపు చూస్తుంది. ఇప్పుడే మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.

మనం జాగ్రత్తగా ఉందాం… తెలుగు సినిమాను విశ్వానికి చాటుదాం…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు