Indian 2 1st Single: గెట్‌ రెడీ.. “ఇండియన్ 2” క్రేజీ అప్డేట్‌ వచ్చేసింది

Indian 2 1st Single: దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న సినిమాలలో ఇండియన్ 2 ఒకటి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? ఎప్పుడు చూద్దామా ? అని ఎంతో ఆత్రుతగా ఉన్నారు ప్రేక్షకులు. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ 2 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పైన అప్డేట్ ఇచ్చింది బృందం. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఇండియన్ 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ కాబోతుంది.

“పారా” పేరుతో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేసి మరి చిత్ర బృందం అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇక ఈ ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ స్పష్టం చేసింది. ఈ పాటకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Get ready for a Promo of the 1st single PAARAA from INDIAN-2

ఇది ఇలా ఉండగా కమల్ హాసన్ హీరోగా… కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఈ సినిమా వస్తోంది. పాన్ ఇండియా దర్శకుడు శంకర్ ఈ సినిమాను చాలా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రకుల్, ఎస్ జె సూర్య, బ్రహ్మానందం, సిద్ధార్థ్, లాంటి కీలక నటీనటులు ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాను ఉదయినిది స్టాలిన్, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

https://x.com/LycaProductions/status/1792805035702677782

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు