OTT Movie : పక్కింటి అమ్మాయి అనుకొని ప్రేమిస్తాడు… పో*ర్న్ స్టార్ అని తెలిశాక…

OTT Movie : డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ప్లిక్స్, ఆహా, జియో సినిమా, జీ5… ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ ఓటిటీ సంస్థలు. మరి ఇన్ని ఓటిటి సంస్థలు ఉంటే అందులో ఏ కంటెంట్ ను చూడాలి అనేది డిసైడ్ అవ్వడం కష్టమే. ఎందుకంటే ప్రతి ఓటీటీ లోను ప్రతి శుక్రవారం కొత్త కొత్త కంటెంట్ రిలీజ్ అవుతుంది. అందులో ఉన్న వందల కొద్ది సినిమాలు సిరీస్ లను సర్చ్ చేసి ఏదో ఒకటి ఫిక్స్ అవడం అంటే అంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదు.

అంతేకాదు ఇప్పటికే యాక్షన్ డ్రామా లాంటి జానర్ లోని సినిమాలను చూసి చూసి విసిగిపోయిన వాళ్ల కోసం ఈరోజు ఒక కొత్త, వింత మూవీని మీ ముందుకు తీసుకొచ్చాం. పక్కింటి అమ్మాయి కదా అని మనసు పారేసుకుంటే ఆ అమ్మాయి ఏకంగా పో*ర్న్ స్టార్ అని తెలుస్తుంది. మరి అతని ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ హాలీవుడ్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఆ మూవీ ఏంటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది అంటే….

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ది గర్ల్ నెక్స్ట్ డోర్. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఏ సర్టిఫికెట్ మూవీ కాబట్టి సింగిల్ గా చూస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు.

- Advertisement -

ది గర్ల్ నెక్స్ట్ డోర్ స్టోరీ..

ఈ వింత లవ్ స్టోరీ ఒక చదువుకునే అబ్బాయి, మరో పో*ర్న్ స్టార్ అయిన అమ్మాయి మధ్య నడుస్తుంది. తనకంటే వయసులో పెద్దదైన పక్కింటి అమ్మాయి పై మనసు పారేసుకుంటాడు ఓ చదువుకునే కుర్రాడు. ఆమె దుస్తులు మార్చుకుంటుండగా చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ అమ్మాయి డైరెక్ట్ గా ఆ కుర్రాడు ఇంటికి వెళ్లి అతని కారులో బయటకు తీసుకెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక ఊహించని విధంగా నడిరోడ్డు మీద ఆ కుర్రాడి బట్టలు మొత్తం విప్పించి వార్నింగ్ ఇస్తుంది. ఈ కుర్రాడు మాత్రం అప్పటి నుంచి ఆ అమ్మాయితో మరింత డీప్ లవ్ లో పడతాడు. అంతేకాదు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ప్రేమలో పడేయాలని డిసైడ్ అవుతాడు.

అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తాడు. మొత్తానికి సక్సెస్ అవుతాడు. కానీ ఆ అబ్బాయి అప్పటిదాకా అనుకున్నట్టుగా తన ప్రేయసి జస్ట్ పక్కింటి అమ్మాయి మాత్రం కాదు. ఆమె ఏకంగా ఒక పో*ర్న్ స్టార్. ఇక విషయం తెలిసి ఆ అబ్బాయి తనకు దూరంగా ఉండడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తాడు. కానీ మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని ప్రేమించడంతో అలా చేయలేక పోతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తాడు. వాడు ఈ అబ్బాయికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. అయితే ఏం జరిగినా సరే వాడు మాత్రం వెనక్కి తగ్గడు. మరి చివరికి వీళ్ళ ప్రేమ ఎక్కడకు చేరింది? అనే విషయం తెలియాలంటే నెక్స్ట్ డోర్ అనే మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు