Naga Vamsi : మోహన్ లాల్ ని కూడా లైన్లో పెట్టిన నాగవంశీ..? అందుకే ప్రత్యేక ట్వీట్!

Naga Vamsi : తెలుగు సినీ ఇండస్ట్రీ లో బడా ప్రొడ్యూసర్లలో ఒకరైన నాగవంశీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చిన్న హీరోల నుండి పాన్ ఇండియా హీరోల దాకా అందర్నీ లైన్లో పెట్టాడు. అన్నిటికి మించి భారీ సక్సెస్ లతో ప్రొడ్యూసర్లలో అందరికంటే టాప్ ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ అత్యధిక సంఖ్యలో సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు అధిపతిగా ఉన్న సితార నాగవంశీ తన వ్యూహాత్మకమైన ప్రాజెక్టులతో వరుస విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం నాగవంశీ చేతిలో పదికి పైగా క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాలు చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా, కంటెంట్ బాగుంటే చాలు హిట్టైపోతున్నాయి. ఇక ఈ మధ్య విడుదలైన “సార్” మరియు “మ్యాడ్” సినిమాలు మంచి విజయాలను సాధించాయి. “టిల్లు స్క్వేర్” వంటి సినిమాతో భారీ వసూళ్లు రాబట్టి సితార ఎంటర్టైన్మెంట్స్ పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

Naga Vamsi gave special birthday wishes to Mohanlal

లాల్ కి స్పెషల్ విషెస్.. సినిమా కూడా?

ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే చిత్రం మే31 న విడుదల కానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా, ఇక ఎంత బిజీగా ఉన్నా కూడా నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా కనిపిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మలయాళం స్టార్ మోహన్ లాల్ ను కలిసి నాగ వంశీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి కూడా వెళ్లారు. లెజెండరీ యాక్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారని ట్వీట్ వేసాడు. అలాగే మోహల్ లాల్ దర్శకత్వంలో రాబోతున్న ‘బెరోజ్’ సినిమాను కూడా ప్రస్తావిస్తూ ఆ సినిమాతో మంచి విజయం అందుకోవాలి అని ట్వీట్ వేశారు. అయితే మోహన్ లాల్ తో సినిమా చేసేందుకే నాగ వంశీ ప్లాన్ చేస్తున్నాడని దానిలో భాగంగానే ఆయన్ని కలిసాడని సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమంటున్నాయి.

- Advertisement -

అరడజను సినిమాలు ఇదే ఏడాది?

ఇక మోహన్ లాల్ తో త్వరలో ఓ సినిమా తీయబోతున్నారని సమాచారం. లేదా ఓ బడా పాన్ ఇండియా సినిమాలో కీ రోల్ లో నటింపచేసే ఛాన్స్ కూడా ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మోహల్ లాల్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మరోవైపు మోహన్ లాల్ తెలుగులో కన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగవంశీ (Naga Vamsi) సినిమాల విషయానికి వస్తే మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో రూపొందుతున్న NBK 109 మూవీ కూడా సితార బ్యానర్ పైనే వస్తోంది. ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. అలాగే దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విజయ్ దేవరకొండ VD 12, కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్, గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్, భాను – రవితేజ చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ వంటి పలు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. అయితే ఇందులో దాదాపు అరడజను సినిమాలు ఇదే ఏడాది విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కుదరకపోతే నాలుగు సినిమాలైనా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు