Star heroines:అభిమానులే అసహ్యించుకునేలా పాడు పని చేసిన హీరోయిన్స్..!

Star heroines.. సాధారణంగా హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు.. అయితే అందంగా ఉంటే సరిపోదు.. బాడీ కూడా ఫిట్ గా ఉండాలి. అప్పుడే చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.. ఈ క్రమంలోనే చాలా వరకూ వర్కౌట్స్ , జాగింగ్ , వాకింగ్ , రన్నింగ్ లాంటివి చేస్తూ బాడీని ఫిట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు.. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఫిట్ గా ఉన్నా లేకపోయినా హీరోయిన్లు మాత్రం కచ్చితంగా ఫిట్ గా ఉండాల్సిందే.. లేకపోతే నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోల్స్ కి గురవ్వాల్సి వుంటుంది. ముఖ్యంగా బాడీ షేమింగ్ కామెంట్లు విపరీతం అయిపోతాయి. అందుకే చాలామంది హీరోయిన్లు కాన్ఫిడెన్స్ కోల్పోయి మానసికంగా కృంగిపోతూ ఉంటారు.. అంతే కాదు ఈ బాధ భరించలేక ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు.

అందుకే మరింత సన్నగా మారి బాడీ షేమింగ్ నుంచి తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది కష్టపడి నాజుగ్గా తయారైనా సరే నెటిజెన్స్ ట్రోల్స్ నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా మారుతూ ఉంటుంది.. అందుకే లక్షలు ఖర్చుపెట్టిన అభిమానులు అసహ్యించుకునేలా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారుమరి అలాంటి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Star heroines: Heroines who have done bad things to make fans hate them..!
Star heroines: Heroines who have done bad things to make fans hate them..!

రకుల్ ప్రీత్ సింగ్:
లౌక్యం , పండగ చేసుకో, ధ్రువ, సరైనోడు, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలతో సూపర్ పాపులర్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఈమె నటించిన స్పైడర్ సినిమా ఫ్లాప్ అయ్యాక టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసింది. ఇక హిందీలో అయ్యారి అనే మూవీతో అరంగేట్రం చేసింది.. ఆ సినిమా ప్రమోషన్స్ టైం లో చాలా సన్నగా తయారై అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అంతకుముందు కొంచెం బొద్దుగా ఉన్నా ట్రోల్స్ ఎదుర్కొంది.. ఇక బక్కగా కనిపించినప్పుడు కూడా చాలామంది ఈమె అవతారాన్ని చూసి విమర్శించారు కూడా..

- Advertisement -

కీర్తి సురేష్:

కీర్తి సురేష్ మహానటి సినిమాలో బొద్దుగా కనిపించి.. ఆ తర్వాత సన్నగా కావడంతో ఈమె అందం కూడా కోల్పోయింది.. దీనివల్ల చాలామంది చబ్బీగా ఉన్నప్పుడే బాగున్నారు.. ఇప్పుడేం బాగోలేరు.. ఏదైనా జబ్బు ఉందా అంటూ రకరకాల కామెంట్లతో ఆమెను హింసిస్తున్నారు.

రాశి ఖన్నా:
ఊహలు గుసగుసలాడే సినిమాలో బొద్దుగా అందంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఆ తర్వాత సన్నగా కనిపించి బాడీ షేమింగ్ కు కూడా గురైంది. అయితే ఇలాంటి వాటిని అసలు పట్టించుకోనని చెబుతూ ఉంటుంది ఈ డేర్ బ్యూటీ..

శృతిహాసన్:
నిజానికి శృతిహాసన్ బొద్దుగా ఉంటేనే బాగుంటుంది.. అయితే సన్నగా మారి అందరి చేత విమర్శలు పొందుతోంది.. ఇక క్రాక్ సినిమాలో ఈమె బక్కగా కనిపించి అందరి చేత ట్రోల్స్ కి గురైంది.

హన్సిక:
దేశముదురు , మస్కా వంటి సినిమాలలో చాలా బొద్దుగా అందంగా కనిపించింది.. కానీ సన్నగా మారిన తర్వాత బాగా ట్రోల్స్ ఎదుర్కొంది.

షాలిని పాండే:

అర్జున్ రెడ్డి సినిమాతో ఫస్ట్ లుక్ లోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవకాశాల కోసం సన్నగా తయారయింది.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఈమె పర్సనాలిటీని చూసి అందరూ మిగతాళి చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు