Samantha : వర్కౌట్స్ చేస్తూ రచ్చ చేస్తున్న సమంత

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సమంతకు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… అప్పటినుంచి ఇప్పటివరకు తన క్రేజ్ ఎక్కడ తగ్గించుకోలేదు. స్టార్ హీరోల సరసన సినిమాలు చేయడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి కూడా రాణించింది సమంత.

అయితే అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్లో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి సమంతను వేధిస్తూనే ఉంది. అటు కెరీర్ లో కూడా సరైన సక్సెస్ లేక సమంత ఇబ్బంది పడుతోంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా… సినిమాలు చేస్తూ తన ఆరోగ్యం పై దృష్టిపెడుతోంది సమంత.

ఈ నేపథ్యంలోనే జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కనువిందు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సమంత… ఫోటోలు షేర్ చేయడమే కాకుండా జిమ్ లో కసరత్తు చేస్తూ కూడా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వర్కౌట్స్ చేస్తూ తాజాగా మెరిసింది సమంత. ఈ వీడియో లో… సమంత… ఓ యుద్ధ వీర వనితలాగా కనిపించింది.

- Advertisement -

https://www.instagram.com/reel/C7PAgUdPLTB/?utm_source=ig_web_button_share_sheet

https://www.instagram.com/reel/C7PAgUdPLTB/?utm_source=ig_web_button_share_sheet

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు