Kichcha Sudeep : కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఆయనకు ఓ కూతురు ఉందన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ పిక్ చూసి సుదీప్ కు ఇంత పెద్ద కూతురు ఉందా? అని నోరెళ్ళబెడుతున్నారు.
సుదీప్ కు 20 ఏళ్ల కూతురు
కిచ్చా సుదీప్ 2001లో ప్రియా సుదీప్‌ని పెళ్ళాడాడు. 2004లో ఈ దంపతులు అందమైన ఆడపిల్లకు తల్లిదండ్రులయ్యారు. ఆమె పేరు శాన్వి. ఆయన తాజాగా శాన్వి 20వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో కిచ్చా సుదీప్ తాజాగా తన కూతురితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
శాన్వి ఏం చేస్తుంది?
తండ్రిలాగే శాన్వికి సినిమాలంటే చాలా ఆసక్తి. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె జిమ్మీ అనే చిత్రంలో ప్లేబ్యాక్ సింగర్‌గా కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. అలాగే విక్రాంత్ రోణ సినిమాలో ఆమె పాడిన పాట కూడా విపరీతంగా హిట్ అయింది. పలు చిత్రాల్లో పాటలు పాడుతున్న శాన్వి.. త్వరలో హీరోయిన్గా మారాలని కోరుకుంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
సుదీప్ న్యూ లుక్ రివీల్
శాండల్‌వుడ్ అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ ఇటీవలే తన సినిమా మ్యాక్స్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. అలాగే వరుసగా 10 నెలల పాటు ఒకే చోట షూటింగ్ జరుపుకున్నందుకు ఆనందాన్ని పంచుకున్నారు. నెక్స్ట్ దర్శకుడు చేరన్ సినిమాకు సుదీప్ అంగీకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. కానీ తాజాగా కిచ్చా సుదీప్ తన కూతురు సాన్వి సుదీప్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన నేపథ్యంలో ఆయన న్యూ లుక్ రివీల్ అయ్యింది. బర్త్ డే పార్టీలో కిచ్చా సుదీప్ తన కూతురు శాన్వితో కలిసి ఫోటో దిగాడు.
సుదీప్ నెక్స్ట్ సినిమా ఏంటి..?
కిచ్చా సుదీప్ నెక్స్ట్ ఏ సినిమాలో చేయనున్నాడనేది ఇంకా రివీల్ కాలేదు. కానీ నాలుగు సినిమాలు అంగీకరించాడు. ఈ నాలుగు సినిమాల్లో మూడు కన్నడ సినిమాలే కావడం విశేషం. అదే విధంగా ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన కబ్జా-2 సినిమా కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అనూప్ భండారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ లో సుదీప్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు చేరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ మూవీ కోసమే ఈ న్యూ లుక్
ఇక ఇప్పటికే మ్యాక్స్ సినిమా షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మాక్స్ లో కిచ్చా సుదీప్ పోలీస్ ఆఫీసర్. తమిళ దర్శకుడు చేరన్ సినిమా కోసమే కిచ్చా సుదీప్ ఈ కొత్త హెయిర్ స్టైల్ అని టాక్ నడుస్తోంది. చేరన్ సినిమాలో కిచ్చా సుదీప్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ముఖ్యంగా సుదీప్ 52వ పుట్టినరోజు సందర్భంగా సుదీప్ ఈ 47వ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మరే సమాచారం బయటికి రాలేదు.