Kalki 2898 AD Bujji Event : ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దాదాపు గత ఐదేళ్లుగా ఈ సినిమా వర్కింగ్ ప్రాసెస్ జరుపుకుంటున్న. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రతి వస్తువును తయారు చేసుకుంటూ వచ్చారు చిత్ర యూనిట్. దీనికోసం ఆటోమొబైల్ ఇంజనీర్స్ తో ఎన్నో చర్చలు జరిపారు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి బుజ్జి అని ఒక వెహికల్ ని తయారు చేశారు. ఈ బుజ్జి అనే వెహికల్ సినిమాలో కీలకపాత్ర పోషించనుంది.
ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ
ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా ఈవెంట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ సినిమాలో బుజ్జి ను రివిల్ చేస్తామంటూ ఒక ఈవెంట్ ను కండక్ట్ చేసారు.
Bujji is here 😍 #Bujji #KalkiBujjiEvent #kalkiad2898 #prabhas #Bujji #Bhirava pic.twitter.com/1CANjtqd5c
— Filmify Official (@FilmifyTelugu) May 22, 2024
నెవర్ బిఫోర్ ఈవెంట్
ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈవెంట్ కు చాలా ఎక్కువ స్థలాన్ని కేటాయించారు. కేవలం స్టేజి ఒక ప్లేగ్రౌండ్ లో ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ ఈవెంట్ లో ప్రభాస్ ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. చాలామంది ఇంజనీర్స్ తో డిజైన్ చేయబడ్డ బుజ్జి అని వెహికల్ ను డ్రైవ్ చేసుకుంటూ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ లుక్స్ ఈ సినిమాలో అదిరిపోయేవి అని చెప్పొచ్చు. లాంగ్ హెయిర్ తో ప్రభాస్ అలా వచ్చి చేయబోతుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి
బుజ్జి ఎలా ఉంది…. #Bujji #KalkiBujjiEvent #kalkiad2898 #kalki3898AD #Bujjievent #Bhirava #Prabhas #Kalki #Deepikapadukone pic.twitter.com/JxeZn3ypnq
— Filmify Official (@FilmifyTelugu) May 22, 2024