ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కల్కి ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా గత ఐదేళ్లుగా ప్రొడక్షన్ లో ఉంది ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో బుజ్జి పరిచయం అంటూ ఒక ఈవెంట్ ను మొదలుపెట్టారు చిత్ర యూనిట్. ఇకపోతే ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీ లో చాలా గ్రాండ్ జరుగుతుంది.
ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ
ఇక ఈవెంట్ విషయానికొస్తే బుజ్జి అనే ఒక వెహికల్ ని చాలామంది ఇంజనీర్స్ తో పాటు కలిసి డిజైన్ చేశారు కల్కి యూనిట్. అయితే బుజ్జి పరిచయం అంటూ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఈవెంట్లో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ కమల్ హాసన్, అమితాబచ్చన్ వీరిద్దరిని చూసి ఇండియా మొత్తం ఇన్స్పైర్ అయింది . వీరిద్దరితోని కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్. ఇకపోతే కమల్ సార్ కి 100 దండాలు అలానే ఈ సినిమా చేసినందుకు థాంక్యూ థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్ అమితాబచ్చన్ గురించి మాట్లాడుతూ అమితాబచ్చన్ లాంటి యాక్టర్ ఇండియాలో ఉన్న ఉండటం మన అదృష్టం. అందరం కూడా ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చాం అంటూచెప్పారు . చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసి అలాంటి బట్టలు కొనమని మా అమ్మను అడిగాను. అంటూ కమల్ హాసన్ పై ఉన్న అభిమానాన్ని చెప్పుకున్నారు.