Aiswarya Rai : ఐశ్వర్య రాయ్ పై నటి కస్తూరి సంచలన ఆరోపణలు

Aiswarya Rai: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే అందులో కొంతమంది మాత్రమే పాపులరవుతూ ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ ఒకరు. విశ్వసుందరిగా అప్పట్లో క్రేజీ సంపాదించుకున్న ఈ అందాల తారకు క్రేజ్ ఇక్కడ కూడా తగ్గలేదు. ఇక ఇటీవల ఈ ఐశ్వర్య రాయ్‌ తన కూతురు ఆరాధ్యతో కలిసి 77 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చి మెరిసింది.

ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్‌ కి గాయం అవ్వడంతో ఆరాధ్య తన తల్లికి సహాయం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపం ఐశ్వర్యారాయ్ కి ఏమైందో తెలియదు కానీ ఆమెను చూస్తే… తమకెంతో బాధగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐశ్వర్య రాయ్‌ గురించి వివాదాస్పద నటి కస్తూరి సంచలన ఆరోపణలు చేసింది.

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీలను కూడా కాలం విడిచిపెట్టదని బాంబు పేల్చింది. ఐశ్వర్య రాయ్ గడియారాయాన్ని వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఆమె అందంగానే ఉండేది… కానీ ప్లాస్టిక్ ఆమె కలకాలం అందాన్ని నాశనం చేసిందని… ఆరోపణలు చేసింది. కాలంతో పాటు అన్ని మారతాయి అన్నట్లుగా సోషల్ మీడియాలో తీరుకుంది. దీంతో నటి కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఐశ్వర్య రాయ్‌ ఫ్యాన్స్ మాత్రం… తమ హీరోయిన్ గురించి నీకెందుకు అంటూ నటి కస్తూరి పై ఫైర్‌ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు