Pushpa 2: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి.
ఇక భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ మూవీ ఇండియన్ సినిమా దగ్గర సరికొత్త లెక్కలతో బిజినెస్ ని చేస్తుంది. ఓటీటీ హక్కులు నుంచి తెలుగు రాష్ట్రాలు సహా నార్త్ ఇండియా మార్కెట్లో కూడా పుష్ప 2 కి కానీ విని ఎరగని రీతిలో బిజినెస్ జరుగుతుంది. అయితే అప్పట్లో ఓవర్సీస్ హక్కులు కూడా సుమారు 100 కోట్లు అంటూ వార్తలు వినిపించాయి.
అయితే ఓవర్సీస్ మార్కెట్ అంతా పక్కన పెడితే అందులో కీలకమైన నార్త్ అమెరికాలో మొత్తం పుష్ప 2 డే పై చేయి అయినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఈ చిత్రానికి ఏకంగా 60 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. ఇది ఈ మధ్య కాలంలో ఉన్న.. రానున్న భారీ చిత్రాల్లో హైయెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి పుష్పరాజు తన హవా నిరూపించుకుంటున్నాడు.