Vijay thalapathy: తలపతి విజయ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు విజయ్. ఇక ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాలను చాలా తమిళ్ లో రీమేక్ చేశారు.
అలా రీమేక్ చేసిన సినిమాలు అక్కడ మంచి విజయం సైతం సాధించాయి. ఇక ఇదిలా ఉంటే విజయ్‌కు విద్య అనే ఓ చెల్లి ఉందట. ఆమె మరణించి ఇప్పటికీ సరిగ్గా 40 ఏళ్లు అవుతుంది. ఆమె సమాధికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో విజయ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విద్య అంటే విజయ్ కు చాలా ఇష్టం.
స్కూల్ నుంచి వచ్చిన తరువాత విద్యాతో ఆడుకుంటాడు. విద్య పక్కనే పడుకునేవాడు. అలాగే తన తల్లి విద్యకు స్థానం చేపించినప్పుడు.. విజయ్ కూడా తన చెల్లికి స్నానం చేపించేవాడట. చెల్లి మరణం తో విజయ్ చాలా కృంగిపోయినట్లు తన తల్లి చెప్పుకొచ్చారు. ఇక తాజాగా తన చెల్లి చనిపోయి 40 ఏళ్లు అవుతుండగా ఎమోషనల్ అయ్యారు విజయ్.