Kalki 2898AD.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, కమలహాసన్ వంటి యాక్టర్స్ నటించడం వల్ల ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కల్కి సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఇటీవలే బుజ్జి అనే ఒక వెహికల్ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేయడంతో హాలీవుడ్ రేంజ్ లో కల్కి సినిమా ఉండబోతున్నట్టుగా కనిపిస్తోంది.
కల్కి రిలీజ్ డేట్..
కల్కి సినిమాలో బుజ్జికి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కీర్తి సురేష్ అందించింది.. జూన్ 27వ తేదీన ఈ సినిమా చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. కల్కి సినిమా విడుదలకు కచ్చితంగా ఒక నెల రోజులు మాత్రం సమయం ఉంది.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదని వార్తలు కూడా ఇటీవలే ఎక్కువగా వినిపించాయి. దీంతో కచ్చితంగా కల్కి మూవీ మరొకసారి వాయిదా పడుతుంది అనుకుంటున్న సమయంలో తాజాగా చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందనే విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తోంది.
చిత్ర బృందానికి స్పెషల్ గిఫ్ట్స్..
కల్కి సినిమాకు సంబంధించిన పలువురు సాంకేతిక టెక్నికల్ సిబ్బంది షూటింగ్ పూర్తి అయ్యిందని తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసినందుకు చిత్ర యూనిట్ తమకు గిఫ్ట్స్ ఇచ్చారంటూ కూడా ఫోటోలను తీసి మరి సోషల్ మీడియా వేదికగా పలు రకాల ఫోటోలను షేర్ చేశారు.. దాదాపుగా ఈ సినిమా కోసం మూడేళ్లుగా చిత్ర యూనిట్ పనిచేస్తూనే ఉంది..VFX వర్కింగ్ తో పాటు కొన్ని సపరేటు సినిమా షూటింగ్స్ సెట్స్ ను వేయడమే కాకుండా.. ప్రత్యేకమైన వాహనాలను కూడా తయారు చేయించారట.
ఆ గిఫ్ట్స్ ఏమిటంటే..
చిత్ర సిబ్బంది షేర్ చేసిన గిఫ్ట్ ల విషయానికి వస్తే.. నాగ్ అశ్విన్ బొమ్మతో మీమ్స్ చేసిన ఒక సరదా టీ – షర్ట్ తో పాటు వెండి కృష్ణుడి బొమ్మ, ఒక చైన్ తో పాటు ప్రేమతో నిర్మాణ సంస్థ నుంచి రాసిన ఒక లెటర్ ని కూడా ఇందులో ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే వీటితోపాటు కల్కి బ్యాడ్జ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిబ్బంది షేర్ చేసిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు సైతం ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కల్కి సినిమా జూన్ 27వ తేదీన విడుదల ఖాయం అనే విధంగా చెప్పవచ్చు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇప్పటికే సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ఈయన ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ కి కల్కి సినిమా ఎలాంటి విజయాన్ని సాధించి పెడుతుందో చూడాలి.
#Kalki2898AD shoot was completed last night with gummadikaya ceremony (pumpkin ceremony) 😃
Expecting a huge unexpected big blockbuster forever in Indian🇮🇳
Tq Engineers, crew and those who were involved in #Kalki2898AD 💥#Prabhas @nagashwin7 @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/hBdmDWAQS7
— BHAIRAVA TEJA🛕🛰️ (@RebelFanteja) May 26, 2024