OTT Movie : అమ్మాయిలను ముట్టుకోకుండానే చంపి, సిటీకి దూరంగా పడేసే సైకో కిల్లర్… ఒక్కో సీన్ కు చెమటలు పట్టాల్సిందే

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే కొంత మంది పడి చచ్చిపోతూ ఉంటారు. అందులో నిమిషానికి ఒకసారి వచ్చే ట్విస్ట్ లు, సస్పెన్స్ అంశాలు ఈ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి మంచి సినిమాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ను ఇస్తాయి. దీంతో ప్రస్తుతం ఓటీటీలో ఉన్న ఇలాంటి సినిమాలను చూసి ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఈరోజు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను విపరీతంగా చూసే బ్యాడ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళ కోసం ఈ మూవీ సజెషన్. ఈ అదిరిపోయే మూవీని చూసారంటే ఒక్కో సీన్ కి చెమటలు పట్టడం ఖాయం. ఈ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ సస్పెన్స్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో కలగలిపి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో పోలీసులు కూడా ఉంటారు. కానీ పోలీసుల కన్నా హంతకుడే ఇంకా ఫాస్ట్ గా ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదూ. ఈ సినిమాలో కూడా అంతే. తమకంటే చురుగ్గా ఆలోచించే కిల్లర్ ఎదురైనప్పుడు పోలీసులు ఏం చేస్తారు ? అనే విషయం తెలియాలంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫూట్ ఫెయిరీ అనే మూవీని చూసి తీరాల్సిందే. ఈ మూవీ రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ తో పాటు జి5 లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. కావాలంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో కూడా చూడొచ్చు.

Footfairy Trailer

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

ఈ మూవీలో ఉండే సైకో కిల్లర్ అమ్మాయిలని మాత్రమే టార్గెట్ చేస్తాడు. అది కూడా రాత్రిపూట ఒంటరిగా తిరిగే అమ్మాయిలపై అకస్మాత్తుగా దాడి చేసి ఎవ్వరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేస్తాడు. అందంగా ఉండే అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకున్నప్పటికీ అతను వాళ్ళ ఒంటిపై చేయి మాత్రం వేయడు. పైగా తను సీరియల్ కిల్లర్ అని నిరూపించుకోవడానికి ఒకే పాటర్న్ లో హత్యలు చేస్తూ ఉంటాడు. విచిత్రంగా అమ్మాయిల కాళ్ళని మాత్రమే కలెక్ట్ చేస్తాడు. బాడీలను సిటీకి దూరంగా డంప్ చేస్తాడు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటారు. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకదు వాళ్లకు. ఓవైపు ఈ వరుస హత్యలతో సిటీ వణికిపోతుంటే, మరోవైపు సైకో కిల్లర్ కోసం పోలీసులు పరిగెత్తి పరిగెత్తి అలసిపోతూ ఉంటారు. సినిమాలో వాడే విలన్ అయినప్పటికీ అతడి తెలివితేటలకు మూవీ లవర్స్ అబ్బుర పడిపోతారు. ఒక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పరుగులు పెట్టించడం అంటే మామూలు విషయం కాదు కదా మరి. ఇక అసలు ఆ సీరియల్ ఎవరు? ఎందుకు అమ్మాయిల కాళ్ళను సేకరిస్తున్నాడు? వాటితో అతను ఏం చేస్తున్నాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఫూట్ ఫెయిరీ మూవీ పై లుక్కెయ్యాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు