Anand Devarkonda: విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఆనంద్ దేవరకొండ. బేబీ చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో స్టేటస్ అందుకున్న ఈ నటుడు ప్రజెంట్ గం గం గణేశా చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఆనంద్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ తన కి మంచి సక్సెస్ ని అందించిన సినిమా మాత్రం బేబీనే.
వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ మూవీ తో ఆనంద్ దేవరకొండ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇక ప్రజెంట్ అదే ఫామ్ లో గం గం గణేశా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇదే క్రమంలో తన మెడపై ఉన్న టాటో కి మీనింగ్ తెలియజేశాడు. తాజాగా తన మూవీని ప్రమోట్ చేస్తూ స్పీచ్ ఇచ్చిన ఈయన తన మెడ పై ఉన్న టాటో కి అర్థం చెప్పాడు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..” ఈ టాటూ ని అనుకోకుండా మా డైరెక్టర్ 2 ఇయర్స్ బ్యాక్ డిజైన్ చేపించారు. మేమేమీ అనుకోలేదు ఏదో చైనీస్ టాటో అనుకున్నాం. కానీ దానిని గూగుల్ లెన్స్ వాడి క్లిక్ చేసి చూస్తే అది ఫ్యామిలీ అని వచ్చింది. కానీ నేను దానిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ కూడా మనందరం ఒక ఫ్యామిలీనే ” అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ దేవరకొండ. ప్రజెంట్ ఆనంద్ దేవరకొండ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.