Ashika Rangnath: టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి ఒకే ఒక్క సినిమా సరిపోతుంది. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది ఆషికా రంగనాథ్. నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. మొట్టమొదటి సినిమా తోనే తన అందం మరియు నటన కనబరిచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ కి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరామ్ మూవీలో కూడా ఈమె నటించుతున్నట్లుగా మూవీ టీం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈ ముద్దుగుమ్మ పై పడింది. ఇక ఈ బ్యూటీ ఒకపక్క వరస సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలని ఆరబోస్తుంది.
తాజాగా ఓ ఈవెంట్ లో తాను డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి. పుష్ప సినిమాలోని ” నువ్వు అమ్మి అమ్మి అంటుంటే నీ పెళ్ళాన్ని అయిపోయినట్లు ఉంది సామి ” అనే సాంగ్ కి ఈ బ్యూటీ తనదైన రీతిలో స్టెప్పులు వేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోస్ అండ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.