Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూవీలో కీర్తి సురేష్.. ఏ సినిమా అంటే..!

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ హీరోయిన్ తో జతకటిన ఆ హీరోయిన్ కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ దక్కుతుంది. అలా కొంతమంది ముద్దుగుమ్మలు ఇప్పటికే మంచి పాపులారిటీని ఏర్పరుచుకున్నారు. ఇక ఆ జాబితాలో కీర్తి సురేష్ కూడా ఒకరు.

పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి అనే సినిమా చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా థియేటర్ల వద్ద ఫ్లాప్ గా నిలిచినప్పటికీ వీరి కాంబినేషన్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

keerthy-suresh-in-pawan-kalyans-movie-what-movie-is-tha
keerthy-suresh-in-pawan-kalyans-movie-what-movie-is-tha

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాలలో హరి హర విర మణులు మూవీ కూడా ఒకటి. ఈ మూవీలో కీర్తి సురేష్ ఓ కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తుంది.‌ ఇక దీనిపై ఇప్పటివరకు అయితే అఫీషియల్ క్లారిటీ రాలేదు. కానీ ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న పవర్ స్టార్ అభిమానులు కృషి అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు