64 years for Rani Ratnaprabha : 64 వసంతాల రాణి రత్నప్రభ.. ఎన్టీఆర్, అంజలి దేవి క్లాసిక్ జానపదం..

64 years for Rani Ratnaprabha :తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అయిదున్నర దశాబ్దాల పాటు అద్భుతమైన సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులని అలరించారు నటసార్వభౌమ ఎన్టీ రామారావు. పౌరాణిక, జానపదాలకు పెట్టింది పేరైన ఎన్టీఆర్ 70వ దశకం వరకు జానపదాలు చేస్తూనే ఉన్నారు. ఇక అందులో ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో “రాణిరత్న ప్రభ” ఒకటి. ఎన్టీఆర్ రామారావు, అంజలీదేవి జంటగా, బి.ఎ. సుబ్బారావు దర్శకత్వం వహించిన క్లాసిక్ చిత్రమిది. అంతే కాదు ఈ చిత్రాన్ని కూడా దర్శకుడు సుబ్బారావే సొంత బ్యానర్ బి.ఎ.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించడం జరిగింది. పూర్తి స్థాయి జానపద చిత్రంగా తెరకెక్కిన “రాణి రత్నప్రభ” విడుదలై నేటికీ (27 మే) 64 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలని కొన్నిటిని తెలుసుకుందాం.

64 years for Rani Ratnaprabha Movie

కథ విషయానికి వస్తే…

రత్నపురిని పాలిస్తున్న అమరసింహుడు ఒకసారి వేటాడేందుకు వెళ్తాడు. అక్కడ అడవిలో రాణి రత్నప్రభను గుర్తించి పలువురు బంధిస్తే.. అతను రక్షిస్తాడు. అయితే అమరసింహ ఆమెకు ఒక సాధారణ సైనికుడిగా పరిచయం చేసుకుంటాడు. వేటనుండి తిరిగి వచ్చిన తరువాత, అమరసింహ తన ముఖ్యమంత్రి సర్పకేతుని రత్నప్రభతో తన పొత్తును సరిచేయమని ఆదేశిస్తాడు. అయితే రత్నప్రభని మోహించిన సర్పకకేతుడు, ఆమెను వలలో వేసుకోవడానికి తన మనిషి అయిన మంజుల ద్వారా కుట్ర పన్నుతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అమరసింహ ముందు రత్నప్రభను దూషించడం ద్వారా రత్నప్రభకు సర్పకకేతు శాసనానికి శిక్ష విధించడానికి రాజ సమ్మతిని జారీ చేస్తాడు. దాన్ని ఉపయోగించుకుని సర్పకేతు తన సొంత షరతు విధించాడు. తన పవిత్రతను నిరూపించుకోవాలంటే రత్నప్రభ చనిపోయి, తిరిగి వెనక్కి రావాలి, మరియు అమరసింహుడిని తన ముద్ర వేయకుండా 3 సార్లు తాకాలి అంటాడు. అప్పుడు రత్నప్రభ విషం తాగి చనిపోయి సమాధి చేయబడింది. అయితే చావడానికి ముందే రత్నప్రభ సర్పకేతుని దౌర్భాగ్యపు ఛాయను చూస్తుంది. అయితే, రత్నప్రభ కొన్ని నాటకీయ పరిణామాల మధ్య తిరిగి బతుకుతుంది. తిరిగి రత్నప్రభ మళ్లీ నల్లటి ఛాయతో ఉన్న అమ్మాయిగా నటిస్తుంది. మరియు అమరసింహను ప్రేమిస్తుంది. కొందరి గూఢచారుల ప్రమేయం తో రత్నప్రభ వాస్తవాలను వెలుగులోకి తెచ్చినప్పుడు, తప్పు తెలుసుకుని చివరకు, అమరసింహుడు పశ్చాత్తాపపడతాడు, సర్పకేతునికి జీవిత ఖైదు విధించబడుతుంది. చివరగా, అమరసింహ & రత్నప్రభల కలయికతో సినిమా ముగుస్తుంది.

- Advertisement -

ఎన్టీఆర్ జానపదాల క్లాసిక్..

ఇక ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో వన్ అఫ్ ది క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. 1960 మే 27న నటించిన (64 years for Rani Ratnaprabha) రాణి రత్నప్రభ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. కానీ తొలుత రిలీజ్ అయినపుడు జనాలు అంతగా పట్టించుకోలేదు. కానీ రిపీట్ రిలీజ్ ల వల్ల, కొన్ని ప్రాంతాల్లో బాగా ఆడింది. అప్పటికీ ఈ చిత్రం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురాగా, పెద్దగా లాభాలు మాత్రం రాలేదు. ఇక ఈ చిత్రంలో ఎన్టీ రామారావు హీరోగా నటించినా, టైటిల్ రోల్ చేసిన అంజలి దేవి నటనకు ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. ఇక సాలూరి రాజెశ్జ్వరరావు ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు