31 Years For Mechanic Alludu : ANR, చిరంజీవి క్లాసిక్ ఎంటర్టైనర్ కి “మెకానిక్ అల్లుడు”కి 31యేళ్లు.. ప్రాఫిట్స్ వచ్చినా ప్లాప్!

31 Years For Mechanic Alludu : టాలీవుడ్ లో అత్యంత 90వ దశకంలో అత్యంత భారీ అంచనాలతో వచ్చిన చిత్రాల్లో “మెకానిక్ అల్లుడు” కూడా ఒకటి. ఈ సినిమా కోసం అభిమానులు అప్పట్లో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. కారణం క్రేజీ కాంబినేషనే. మెగాస్టార్ చిరంజీవి, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రమిది. ఈ ఇద్దరూ కలిసి తొలిసారిగా నటించిన ఏకైక చిత్రం. అప్పటికే గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తో తెలుగు నాట నెంబర్ వన్ హీరోగా ఏలుతున్న మెగాస్టార్ నుండి చిరు నుండి వచ్చిన చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలతో సినిమా కోసం ఎగబడ్డారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా పరాజయం పాలయింది. కానీ ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి నచుతుంది. కాంబినేషన్ వల్ల కావచ్చు, పాటల వల్ల కావచ్చు మెకానిక్ అల్లుడు అభిమానులకి నచ్చిన సినిమా. ఇక 1993 మే 27న (31 Years For Mechanic Alludu) రిలీజ్ అయిన “మెకానిక్ అల్లుడు” సినిమా రిలీజ్ అయి నేటికీ 31 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలను కొన్నింటిని చర్చిద్దాం.

31 Years For Mechanic Alludu Movie

చిరంజీవి ANR కాంబినేషన్ మూవీ..

మెగాస్టార్ చిరంజీవి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఇది. అప్పటికే వరుస ఇండస్ట్రీ హిట్ సినిమాలతో నెంబర్ 1 హీరో గా మారిపోయాడు చిరు. నెంబర్ 1 గా కొనసాగుతున్న చిరంజీవి, ఇండస్ట్రీ కి రెండు కళ్లులాంటి వారిలో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు తో కలిసి సినిమా చేస్తుండడం తో మూవీ పై అంచనాలు విడుదలకు ముందు నుండే భారీ స్థాయిలో ఉండేవి. కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యి బిలో యావరేజ్ అయింది. అయితే చిరంజీవి మరియు అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ వెండితెర మీద చూస్తున్నంతసేపు మాత్రం అభిమానులకు బాగా నచ్చింది. అయితే సినిమా సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ స్క్రీన్ ప్లే తో గాడి తప్పింది. ఫలితంగా ఆడియన్స్ కి ఈ సినిమా బాగా బోర్ అనిపించడం వల్ల అంతగా బాక్స్ ఆఫీస్ పై ప్రభావం చూపలేదు. అయితే కాంబినేషన్ క్రేజ్ వల్ల ఈ చిత్రానికి అప్పట్లో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అయితే టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ ఉండడం వల్లే సినిమాలు హిట్ అవుతాయి అనుకోవడం తప్పని ఈ సినిమాని చూసి చెప్పొచ్చు. దిగ్గజ స్థాయిలో ఉన్న స్టార్ హీరోలు మల్టీస్టారర్ చిత్రాలు చేయగా, అవి కొన్ని సందర్భాలలో ఫ్లాప్స్ గా నిలవడం వంటివి జరిగాయి. అలాంటి వాటిలో మెకానిక్ అల్లుడు ఒకటిగా నిలిచింది.

- Advertisement -

మెగాస్టార్ అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్..

అయితే సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా, భారీ అంచనాలతో విడుదలైన మెకానిక్ అల్లుడు ఆ రోజుల్లో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించిందట. కానీ అప్పట్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ చిత్రానికి దాదాపుగా 6 కోట్ల రూపాయలకు జరిగిందట. అయితే ఇంత పెద్ద కాంబినేషన్ కావడం తో బయ్యర్స్ కళ్ళు మూసుకొని ఈ సినిమాని కొనేశారు. బంపర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ చిత్రానికి ఓవరాల్ గా ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ కి బాగానే నచ్చింది. ముఖ్యంగా చిరంజీవి మరియు నాగేశ్వర రావు కాంబినేషన్ లో వచ్చే ‘గురువా గురువా’ అనే సాంగ్ అప్పట్లో పెద్ద హిట్. అలాగే ఈ సినిమాలో చిరు, విజయశాంతి కాంబోలో వచ్చే సెట్ సాంగ్ “ఘుమ్మని తుమ్మెద” సాంగ్ చాలా మందికి ఫేవరేట్. కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయం లో డైరెక్టర్ కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయ్యేదని ట్రేడ్ పండితులు ఇప్పటికీ అంటుంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు