46 years for Mugguru Muggure : 46 వసంతాల ముగ్గురు ముగ్గురే!.. నటశేఖర కృష్ణ హ్యాట్రిక్ కం బ్యాక్ మూవీ!

46 years for Mugguru Muggure : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘నటశేఖర కృష్ణ’ ఆరు దశాబ్దాల పాటు తన సినీ ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగించారు. ఇక డేరింగ్ డాషింగ్ హీరోగా అప్పట్లోనే విభిన్నమైన చిత్రాలు చేసి రికార్డులు సృష్టించారు “కృష్ణ”. ఒక్క హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా పలు చిత్రాలు తెరకెక్కించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలందుకున్నారు. ఇక అప్పట్లో ఎన్నో సినిమాలతో కృష్ణ చేసినన్ని సాహసాలు, ప్రయోగాలు ఎవరూ చేయలేరని అంటుంటారు. తెలుగు సినిమాల్లో ఫస్ట్ స్పై థ్రిల్లర్స్, ఫస్ట్ కౌ బాయ్ మూవీ లాంటి చిత్రాలతో పాటు, ఫస్ట్ 70MM సినిమా, ఫస్ట్ స్టీరియో స్కోప్ సినిమాలు తెరకెక్కించి అరుదైన ఘనత సాధించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇక నటశేఖర కృష్ణ ఆ రోజుల్లోనే ఏడాదికి 18 సినిమాలు చేసి చరిత్ర సృష్టించారు. ఒకే రోజు 3 షిఫ్ట్ లలో మూడేసి సినిమాలు షూటింగ్ చేసిన ఘనత ఆయనది. ఇక 1978లో సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా 12 సినిమాల్లో నటించాడు. అందులో సూపర్ హిట్ అయిన “ముగ్గురూ ముగ్గురే” చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా 1978 మే 27న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలను కొన్నిటిని తెలుసుకుందాం.

46 years for Mugguru Muggure Movie

కృష్ణ హ్యాట్రిక్ కం బ్యాక్ సినిమా ఇది..

ఇక నటశేఖర కృష్ణ తో పాటు నవరసకథానాయకుడు కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు లు టైటిల్ రోల్ లో ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. జయచిత్ర హీరోయిన్ గా నటించగా, మహానటి సావిత్రి ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమా ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, ఈ సినిమా అక్రమ రవాణాలు, స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కృష్ణ నటించారు. సినిమా కథ మొత్తం ఒక డైమండ్ ని దక్కించుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో హీరో, విలన్లతో పాటు చాలా మంది కన్ను ఆ డైమండ్ పై ఉంటుంది. అయితే హీరో వాళ్ళందర్నీ ఎదుర్కొని ఆ వజ్రాన్ని ప్రభుత్వానికి ఎలా అప్పచెప్పాడు అన్న దానిపైనే ఈ సినిమా కథ ఉంటుంది.

- Advertisement -

ఇక సూపర్ స్టార్ కృష్ణ అంతకు ముందు ఏడాది వరుస ప్లాపులతో సతమతమయ్యారు. ఓ వైపు ఎన్టీఆర్ ఏఎన్నార్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే కనీసం ఓ మోస్తరు సినిమా కూడా చేయలేకపోయిన సమయం అది. అలాంటి టైం లో కృష్ణ వరుసగా ఏజెంట్ గోపి, దొంగల దోపిడీ, ముగ్గురూ ముగ్గురే వంటి విజయాలతో హ్యాట్రిక్ హిట్లు సొంతం చేసుకుని మళ్ళీ తన సత్తా చాటారు. S.D. దయాళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గుమ్మాల లక్ష్మణ రావు నిర్మించారు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా హిందీ లో సూపర్ హిట్ అయిన 1976 లో వచ్చిన “ఏక్ సే బడ్కర్ ఏక్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఆ రోజుల్లోనే 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది ముగ్గురూ ముగ్గురే (46 years for Mugguru Muggure) సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు