Coolie: 38 ఏళ్ళు తరువాత వాళ్ళను కలపబోతున్నాడు

Coolie: లోకేష్ కనగరాజ్ ఎంబీఏ పూర్తి చేసిన తరువాత నాలుగున్నర సంవత్సరాలు బ్యాంకులో పని చేస్తూ సినిమాలపై ఇష్టంతో 2014లో ‘కస్టమర్ డిలైట్’ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కు ఓ కార్పొరేట్ ఫిల్మ్ కాంపిటీషన్​లో మొదటి ప్రైజ్ వచ్చింది. ఆ కాంపిటీషన్ న్యాయనిర్ణేతగా సినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఆలా ఆయనతో ఏర్పడిన పరిచయంతో 2016లో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ‘అవియల్’ అనే ఇండిపెండెంట్ ఆంతాలజీ సినిమాలో ఒక భాగమైన ‘కాలం’ షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించి అలా కార్తీక్ సుబ్బరాజు వల్ల ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

మూడవ సినిమాతో మల్టీ స్టారర్

సందీప్ కిషన్ నటించిన మానగరం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సినిమా తెలుగులో నగరం పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో కూడా ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత కార్తీ హీరోగా ఖైదీ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఒక రాత్రి ప్రయాణాన్ని ఇంత ఎంగేజింగ్ గా చూపించొచ్చు అని ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు లోకేష్. వెంటనే విజయ్ విజయ్ సేతుపతిని పెట్టి మల్టీస్టారర్ సినిమాని చేశాడు. సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ని సాధించింది.

కమల్ హాసన్ మాస్ కంబ్యాక్

లోకనాయకుడు కమల్ హాసన్ ఆల్మోస్ట్ సినిమా కెరియర్ ఎండింగ్ వచ్చింది అనుకునే తరుణంలో విక్రమ్ అనే సినిమాను తీశాడు లోకేష్. అయితే ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు రిలీజ్ ముందు వరకు ఉండేది. రిలీజ్ ముందు రోజు ఈ సినిమా చూసే ముందు ఒకసారి ఖైదీ సినిమా చూడండి అంటూ లోకేష్ పెట్టిన ట్వీట్ తో సోషల్ మీడియా అంతా హీట్ ఎక్కింది. ఇంక సినిమా రిలీజ్ తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమా ప్రేమికులందరికీ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇక్కడితో లోకేష్ కనకరాజు పేరు మారు మోగిపోయింది. లోకేష్ కనకరాజు నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే తెలుగు ప్రేక్షకులు కూడా వేయికళ్లతో ఎదురు చూడటం మొదలుపెట్టారు అలా విజయ్ చేసిన లియో సినిమా కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు.

- Advertisement -

Satya Raj
మళ్లీ 38 ఏళ్ల తర్వాత

ఇకపోతే లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో తోని గూస్ బమ్స్ తెప్పించాడు. ఈ సినిమా కోసం ఎంతోమంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో సత్యరాజు కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాతో కట్టప్ప పాత్రలో కనిపించిన సత్యరాజ్ కు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపు ఉంది. అయితే రజనీకాంత్ సత్యరాజ్ కలిసే నటించి దాదాపు 38 ఏళ్లు పైన అవుతుంది. వీళ్ళిద్దరికీ మధ్య కొద్దిపాటి విభేదాలు కూడా ఉన్నాయని అప్పట్లో కథనాలు వినిపించాయి. అయితే వీరిద్దరినీ మళ్లీ కూలీ సినిమా కలపడం అనేది శుభ సూచకం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు