Upasana Assets : మెగా కోడలు ఉపాసన ఆస్తి ముందు హీరోయిన్ల ఆస్తి దిగదుడుపే..!

Upasana Assets : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కోడలుగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఉపాసన కొణిదెల.. రామ్ చరణ్ భార్యగా కూడా అంతే క్రేజ్ ను సంపాదించుకుంది. ఉపాసన మెగా కోడలు కావడంతో మెగాస్టార్ కుటుంబం కూడా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె చేసే మంచి పనులు కూడా ఎప్పుడు మెగా కుటుంబం రేంజ్ ని పెంచేలా చేస్తూ ఉంటాయి. రామ్ చరణ్ కూడా భారతదేశంలోని అత్యంత సంపన్న హీరోలలో ఒకరిగా పేరు సంపాదించారు. అయితే చాలా మందికి ఉపాసన కామినేని ఆస్తి గురించి తెలియకపోవచ్చు.. ముఖ్యంగా అభిమానులలో ఈ విషయం గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది.

అపోలో గ్రూప్స్ వారసురాలిగా..

ఉపాసన కేవలం రామ్ చరణ్ భార్య మాత్రమే కాదు.. ఆమె అపోలో గ్రూప్స్ సామ్రాజ్యంలో కీలకమైన బాధ్యతలను కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. దాదాపుగా ఈ అపోలో గ్రూప్ 77,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడిలో ఉన్నది. అపోలో హాస్పిటల్ సిఎస్ఆర్ విభాగంలో వైస్ చైర్మన్ గా ఉన్నది. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్నారు.. రామ్ చరణ్, ఉపాసన ఆస్తి విలువ సుమారుగా రూ. 2,500 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.

ఉపాసన ఆస్తి విలువ..

అయితే ఇందులో రామ్ చరణ్ ఆస్తి విలువ రూ.1,350 కోట్ల రూపాయలు ఉండగా.. ఉపాసన ఆస్తి విలువ రూ.1,150 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది… ఈ రెండిటిని కలిపితే సుమారుగా రూ.2, 500 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉన్నట్లు చెప్పవచ్చు.. దేశంలోనే సంపన్నమైన సెలబ్రిటీ కపుల్స్ గా పేరు సంపాదించారు.. ఇంతటి ఆస్తి సినీ హీరోయిన్స్ కి కూడా లేదని చెప్పవచ్చు.. ఉపాసన ముందర ఇతర హీరోయిన్స్ కూడా ఆస్తి విషయంలో దిగదుడిపే అని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన లండన్ నుండి ఎంబీఏ హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి డిగ్రీ చేసింది. ఇక ప్రస్తుతం తన అత్తమ్మతో కలిసి అత్తమ్మస్ కిచెన్ అనే ఒక బిజినెస్ ని కూడా మొదలుపెట్టారు ఉపాసన ఇలా అన్ని రకాలుగా అన్ని రంగాలలో దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు.

- Advertisement -

బంగ్లాలతోపాటు ఖరీదైన కార్లు కూడా..

Upasana: Mega daughter-in-law Upasana's property does not come before heroines' property..!
Upasana: Mega daughter-in-law Upasana’s property does not come before heroines’ property..!

ముఖ్యంగా హైదరాబాదులో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉన్నది. దాదాపుగా దీని విలువ 50 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.. అలాగే వీరికి ఒక ప్రైవేటు జెట్ తో సుమారుగా 4 కి పైగా ఖరీదైన కార్లు కూడా ఉన్నవి. రామ్ చరణ్, ఉపాసనకు క్లింకార అనే కూతురు కూడా జన్మించింది. వీరికి కూతురు జన్మించిన తర్వాత మరింత కలిసి వచ్చిందని కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. ఒకవైపు రాంచరణ్ సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. ఉపాసన కూడా ఒకవైపు కోడలిగా, భార్యగా , తల్లిగా అన్ని బాధ్యతలు చేపడుతూ వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతోంది.

సంపాదించడమే కాదు సహాయం చేయడం కూడా తెలుసు..

మరి రాబోయే రోజులలో ఉపాసన కూడా మరింత ఎత్తుకు ఎదగాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఉపాసన ఎన్నో చారిటీ ట్రస్టులకు సైతం తన వంతు సహాయం చేస్తూనే ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం వీరి ఆస్తి మాత్రమే ఈ రేంజ్ లో ఉందంటే ఇక వీరి పెద్దల ఆస్తి కలిపితే మరెన్ని వేల కోట్లు అవుతుందో ఊహించలేమని చెప్పవచ్చు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు