Ajith: హైదరాబాద్‌ లో బైక్‌ పై రచ్చ చేస్తున్న అజిత్‌

Ajith Roaming On Bike : సౌత్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో కొంతమంది కష్టపడి పైకి వస్తుంటే.. మరి కొంతమంది లక్కీగా స్టార్ హీరో లు అవుతున్నారు. ఇక మరి కొంతమంది హీరోలు… ఏజ్ పైబడినా కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అలాంటి హీరోలలో తమిళ హీరో అజిత్ కుమార్ ఒకరు.

హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ సినిమాలలో అరుదైన సీన్లను చేయడంలో అజిత్ కుమార్ దిట్ట. అయితే అలాంటి అజిత్ కుమార్… ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Actor Ajith's pics from motorcycle tour in Europe go viral

- Advertisement -

ఈ సినిమాలో హీరో అజిత్ కుమార్ మూడు పాత్రల్లో కనిపిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అజిత్ కుమార్… హైదరాబాద్ వీధుల్లో బైక్ పై చెక్కర్లు కొడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అజిత్ కుమార్… హైదరాబాద్ వీధుల్లో బైక్ నడుపుతూ వెళ్లాడు. అయితే.. ఆ వీడియోను తీసి వెంటనే సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు