HBD Faria Abdullah: అందుకే ఇండస్ట్రీకి వచ్చా – చిట్టి..!

HBD Faria Abdullah..టాలీవుడ్ హీరోయిన్లలో భారీ హైట్ కలిగిన వున్న హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. వాస్తవానికి ఫరియా తెలంగాణ అమ్మాయి కావడం చేత ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగానే సంపాదించుకుంటోంది. కరోనా సమయంలో జాతి రత్నాలు సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అందులో చిట్టి పాత్రలో నటించి అద్భుతంగా మెప్పించడంతో ఈమె పేరును అప్పటినుంచి ముద్దుగా అభిమానులు చిట్టి అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ రోజున ఫరియా అబ్దుల్లా 26వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పల్లి విషయాలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కథల ఎంపిక విషయంలో అది చూస్తా..

HBD Faria Abdullah: That's why I came to the industry - Chitti..!
HBD Faria Abdullah: That’s why I came to the industry – Chitti..!

ఫరియా ఇటీవలే అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈమె.. ముఖ్యంగా సినిమా టైం ఎంత ఉంటుంది..? ఇందులో అతిథి పాత్రలో ఎవరైనా ఉన్నారా? లేరా? అనే విషయాన్ని కూడా చూసుకుంటానని తెలిపింది.

అందుకే ఇండస్ట్రీకి వచ్చా..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వాటిని భర్తీ చేయడానికి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చానని తెలియజేసింది. ఇలాంటి తరహా పాత్రలైతే తనకు బాగా సరిపోతాయని కూడా తెలియజేసింది ఫరియా అబ్దుల్లా.. ఇలాంటి పాత్రలు చేయడానికి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చానంటూ స్పష్టం చేసింది ఫరియా అబ్దుల్లా.

- Advertisement -

ఫరియా అబ్దుల్లా సినిమాలు..

ప్రస్తుతం ఈమె చేతిలో మత్తు వదలరా-2 సినిమాతో పాటు భగవంతుడు అనే సినిమాలో కూడా నటిస్తున్నానని తెలిపింది.. అలాగే రాబోయే రోజుల్లో జాతి రత్నాలు-2 సినిమాలో కూడా నటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఫరియా అబ్దుల్లా కెరియర్..

2021లో తెలుగులో వచ్చిన జాతి రత్నాలు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు మోడలింగ్ చేసేది ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్ గా యూట్యూబర్ గా కూడా పలు వీడియోలు చేసింది ఫరియా.. ఇక నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 1998 మే 28న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో సంజయ్ అబ్దుల్లా , కౌసర్ సుల్తానా దంపతులకు జన్మించిన స్వర్గా అబ్దుల్లా పదవ తరగతి వరకు మెరిడియాన్ & భవనస్ లో పూర్తి చేసింది. హైదరాబాద్ లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది.. ఇంక జాతి రత్నాలు సినిమాలో చిట్టి క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో మీనాక్షి క్యారెక్టర్లు అలరించింది. ఇక తర్వాత 2022లో వచ్చిన బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాలో కూడా నటించింది. వీటితోపాటు రావణాసుర , ఆ ఒక్కటి అడక్కు చిత్రాలలో నటించి మెప్పించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు