38Years Of Veta : మెగాస్టార్ చిరంజీవి కల్ట్ క్లాసిక్ “వేట”కి 38ఏళ్ళు.. ఇండస్ట్రీ హిట్ కావాల్సింది అండర్రేటెడ్ గా నిలిచిపోయింది..

38Years Of Veta : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కోదండ రామిరెడ్డిలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. “న్యాయంకావాలి” చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం “ముఠామేస్త్రి” దాకా 23 సినిమాలొచ్చాయి. ఇందులో ఏకంగా 18 సినిమాలు విజయం సాధించడం ఓ రికార్డ్.. అయితే వీరి కాంబినేషన్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకి మొట్టమొదట గుర్తొచ్చే పేరు “ఖైదీ”. ఈ సినిమాతోనే చిరంజీవి, స్టార్ హీరోగా, కోదండరామిరెడ్డి స్టార్ డైరెక్టర్ గా మారారు. అంతే కాదు ఆరోజుల్లోనే ప్రేమాభిషేకం రికార్డులు బ్రేక్ చేసి చిరంజీవికి మొదటి ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈ కాంబినేషన్ లో వచ్చి సంచలన విజయం సాధించాయి. అయితే ఖైదీ తర్వాత అంతకు మించిన భారీ అంచనాలతో విడుదలైన కమర్షియల్ చిత్రం “వేట”. ప్రతీకారం నేపథ్యంలోనే తెరకెక్కిన ఖైదీకి ఆల్మోస్ట్ సెమిలర్ గా, ప్రతీకార జ్వాలని వేటాడి చల్లార్చుకునే చిత్రం గా తెరకెక్కింది ఈ వేట చిత్రం. ఇప్పటికి చిరంజీవి క్లాసిక్ చిత్రాల్లో చాలామందికి ఫెవరేట్ ఈ “వేట” చిత్రం. అయితే ఇండస్ట్రీ హిట్ కావాల్సిన రేంజ్ ఉన్న సినిమా ఆరోజుల్లో ప్లాప్ అయిందంటే చాలా మంది నమ్మరు. కానీ ఇది నిజం. చిరంజీవి చిత్రాల్లో అండర్రేటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన వేట చిత్రం విడుదలై (మే28 1986) నేటికీ 38 వసంతాలు (38Years Of Veta) పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలని కొన్నిటిని చర్చిద్దాం.

38Years Of Veta movie

ఖైదీ ని మించి అంచనాలు పెట్టుకోవడంతో నిరాశ..

ఇక ఈ చిత్రంలో చిరంజీవి, జయప్రద జంటగా నటించగా, సుమలత, కళావాచస్పతి జగ్గయ్య, నూతన్ ప్రసాద్, రంగనాథ్, మోహన్ శర్మ వంటి భారీ తారాగణం నటించారు. ఇక ఈ సినిమా కొరకు మెగాస్టార్ చిరంజీవి ఆ రోజుల్లోనే 60 రోజుల పాటు పని చేశారు. ఇక పరచూరి బ్రదర్స్ అందించిన మాటలు తూటాల్లా ఉంటాయి ఈ సినిమాలో. దానికి తగ్గట్టు చక్రవర్తి సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఖైదీని మించి ఈ సినిమాపై ఆశించడంతో, కథ నేపథ్యం ప్రతీకారంగా ఒకే కాన్సెప్ట్ ఉండడంతో అభిమానుల అంచనాలను ఆ రోజుల్లో అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా మొత్తాన్ని నడిపించింది మెగాస్టార్ చిరంజీవే అనడం లో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో చిరు ప్రతిసన్నివేశంలోనూ తన కళ్ళతో పలికించిన హావభావాలు స్పెషల్ అట్రాక్షన్. ఇక సినిమా రెండో భాగంలో మహా రాణాప్రతాప్ గా నీలికళ్ళతో చిరు కనిపించడం అప్పట్లో హైలెట్. ప్రతీకార జ్వాలతో క్రూరత్వం నిండిన ప్రతాప్ గా చిరంజీవి జీవించారని చెప్పాలి.

- Advertisement -

వేట ప్లాప్ కి కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి..!

అయితే ఎన్నో అంచనాలతో తెరకెక్కిన “వేట” సినిమా ప్లాప్ అవుతుందని దర్శకనిర్మాతలు సహా హీరో కూడా ఊహించలేదు. ఆ మధ్య సమంత సామ్ జామ్ షో కి వచ్చిన చిరంజీవి వేట సినిమా గురించి ప్రస్తావిస్తూ తనకెంతో ఇష్టమైన ఈ సినిమా ప్లాప్ అయినందుకు, అప్పట్లో ఇంట్లో ఎవరికీ తెలీకుండా గదిలో ఏడ్చానని చిరు చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి క్రేజ్ తో అప్పట్లో భారీ అంచనాలతో విడుదలై స్వల్ప నష్టాలతో బయటపడింది. అప్పట్లోనే నైజాంలో మొదటి రోజు 4 లక్షలకి పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అయితే అప్పుడు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తెలుగు సినీ అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు