Jabardasth : జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్న ఇంద్రజ… ఆ హీరోయిన్ కారణమా ?

Jabardasth : జబర్దస్త్ షోకు బుల్లితెర ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూస్తున్నంత సేపూ కడుపుబ్బా నవ్వించే ఈ షోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి గురువారం టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కోసం ఆడియన్స్ ను అలరించడానికి టీం లీడర్లు వెయిట్ చేస్తే, మరోవైపు ఈ షోను ఎంజాయ్ చెయ్యడానికి బుల్లితెర ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తైతే జడ్జి సీట్లలో ఉన్న ప్రముఖుల ఎక్స్ప్రెషన్స్, డైలాగులు, నవ్వులు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజకి జబర్దస్త్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమె ఈ షో నుంచి తప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది.

జబర్దస్త్ నుంచి ఇంద్రజ అవుట్

తాజాగా జబర్దస్త్ షోకి సంబంధించి రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో తాను షో నుంచి తప్పుకోబోతున్నాను అనే విషయాన్ని ఇంద్రజ స్వయంగా రివీల్ చేసింది. జబర్దస్త్ లో చిన్న గ్యాప్ తీసుకుంటున్నాను అంటూ ఇంద్రజ చెప్పిన మాటలు అందరికీ షాక్ ఇచ్చాయి. స్టేజ్ మీద ఆవిడ ఈ విషయం చెబుతూ కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే ప్రోమోలో జబర్దస్త్ లో తనతో ఎంతో సన్నిహితంగా ఉండే, తల్లిలా చూసుకునే నూకరాజును ఆమె ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని భావోద్వేగానికి లోను కావడం కనిపించింది. దీంతో హఠాత్తుగా ఇంద్రజ ఈ షోకి దూరం కావడానికి కారణం ఏంటి అనే చర్చ మొదలైంది. ఇక అందరికీ టక్కుమని  బల్బులా వెలిగిన ఆలోచన ఏంటంటే మరో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ సీటుకి ఎసరు పెట్టిందా? అనే అనుమానం.

Jabardasth,Indraja: రోజా వద్దు.. ఇంద్రజ ముద్దు.. జబర్దస్త్‌ జడ్జీకి అనూహ్య  మద్దతు, మల్లెమాలకి వినతులు వెల్లువ - heroine indraja fans request to  mallemala over jabardasth judge ...

- Advertisement -

ఆ హీరోయిన్ కారణమా?

జబర్దస్త్ అనగానే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుకొచ్చేది మెగా బ్రదర్ నాగబాబు తో పాటు సీనియర్ హీరోయిన్ రోజా. ఈ షో మొదలు పెట్టినప్పటి నుంచి టిఆర్పి రేటింగ్ పీక్స్ కు వెళ్లేదాకా వీళ్ళిద్దరి సహకారం ఈ షోకు చెప్పలేనంత ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా జడ్జ్ సీట్లలో కూర్చున్న నాగబాబు, రోజా నవ్వులు అప్పట్లో హైలెట్ అనే విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో వీళ్ళిద్దరూ షోకు దూరం కావడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయడానికి నిర్వాహకులకు చాలా టైం పట్టింది. సింగర్ మనో నుంచి ఎంతో మందిని ట్రై చేశారు.

కానీ చివరకు సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్, ఇంద్రజ, కుష్బూలతో ఈ షోకు మళ్లీ గత వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జ్ లుగా వ్యవహరిస్తుండగా, సడన్ గా ఆమె ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో రోజా మళ్లీ జబర్దస్త్ జడ్జ్ గా రాబోతోందా అనే డౌట్లు పుట్టుకొస్తున్నాయి. అందుకే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలో తనదైన మార్కెట్ క్రియేట్ చేసిన ఇంద్రజ సడన్ గా ఈ షో నుంచి తప్పుకుంటుంది అనే టాక్ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు