Raayan Postponed : ధనుష్ రాయన్ కు రిలీజ్ డేట్ కష్టాలు… మళ్ళీ పోస్ట్ పోన్

Raayan Postponed : ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ కు రిలీజ్ డేట్ కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ మూవీ మరోసారి వాయిదా పడిందనే టాక్ నడుస్తోంది. రాయన్ పోస్ట్ పోన్ కావడానికి కారణం ఏంటి ? కొత్త రిలీజ్ డేట్ సంగతేంటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

ధనుష్ హీరోగా, దర్శకుడిగా..

ధనుష్ నటుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాతగా తమిళ సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ మల్టీ టాలెంటెడ్ హీరో రాయన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ధనుష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో హీరోగా కూడా నటించాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్ రాయన్‌కు సంగీతం అందించారు.

రాయన్ కు రిలీజ్ డేట్ కష్టాలు

రాయన్ చిత్రం వాస్తవానికి జూలైలో విడుదల కావాల్సి ఉంది. శంకర్-కమల్ హాసన్‌ల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 జూన్ లో విడుదల కావలసి ఉండగా, తాజాగా ఈ మూవీని జూలైలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు శంకర్. దీంతో రాయన్ మూవీని జూలై నుంచి మార్చి జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ మూవీ విడుదలకు ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఆడియో లాంచ్, ట్రైలర్ లాంటి అప్ డేట్స్ ఏవీ రిలీజ్ చేయకుండా సైలెంట్ గా ఉంది చిత్రబృందం.

- Advertisement -

Raayan' first single to be out soon; confirms Dhanush | Tamil Movie News -  Times of India

ఈ నేప‌థ్యంలో రాయన్ రిలీజ్ డేట్ మ‌ళ్లీ వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా జూన్ 13 నుంచి జులైకి వాయిదా పడిందని అంటున్నారు. ఇండియన్ 2 జూలై 2వ వారంలో విడుదలవుతోంది. కాబట్టి రాయన్ మూవీ దానితో పోటీపడే ఆలోచనలో లేదు. అందుకే మళ్లీ పోస్ట్ పోన్ చేసుకున్నారని అంటున్నారు.

రాయన్ కొత్త రిలీజ్ డేట్

ఇప్పుడు రాయన్ మరోమారు వాయిదా పడబోతోంది అని వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియదు. కానీ మూవీ పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటో కూడా తెలియరాలేదు. రాయన్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేదా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే ఈసారి రాయన్ వాయిదా పడుతుందని టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ధనుష్ పుట్టినరోజు సందర్భంగా జూలై మొదటి వారంలో లేదా జూలై చివరి వారంలో రాయన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ జూలై చివరి వారంలో కల్కి రిలీజ్ ఉంటుంది కాబట్టి ధనుష్ రాయన్ కొత్త రిలీజ్ డేట్ గా ఏ తేదీని ఫిక్స్ చేస్తారో చూడాలి.

రాయన్ లో నటిస్తున్న స్టార్స్

రాయన్ లో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, ఎస్‌జె సూర్య, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్ నటిస్తున్నారు. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ధనుష్ స్క్రిప్ట్ అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. అందులో ఘనా పాట ఒకటి. దీనిని సంతోష్ నారాయణన్ పాడారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు