Renudesai: నెటిజెన్స్ కి షాక్.. ఇంస్టాగ్రామ్ కి దూరంగా రేణూ..!

Renudesai: ప్రముఖ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యి .. ఇటీవలే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది. హేమలత లవణం క్యారెక్టర్ లో లీనం అయిపోయిన ఈమె.. తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది.. ఇప్పుడు మళ్లీ సరైన సినిమా కోసం ఎదురుచూస్తోంది.. మరొకవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని.. అలాగే సమాజంలో జరిగే అంశాలపై కూడా స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది .. ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించే ఈమె ఇప్పుడు ఇంస్టాగ్రామ్ కి దూరం కాబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది..

ఇంస్టాగ్రామ్ కి దూరం కానున్న రేణూ దేశాయ్..

Renudesai: Shock to netizens.. Renu away from Instagram..!
Renudesai: Shock to netizens.. Renu away from Instagram..!

అసలు విషయంలోకి వెళితే.. రేణూ దేశాయ్ తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూనే మరొక వైపు జంతువుల సంక్షేమాన్ని కూడా చేపడుతూ ఉంటుంది.. ప్రత్యేకించి పెట్స్ కి సంబంధించిన అన్ని అవసరాలను ఈమె తీరుస్తూ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెట్స్ కోసం ఫండ్ రైస్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇంస్టాగ్రామ్ ద్వారా ఎవరినైనా సరే సంప్రదిస్తూ ఉంటుంది.. దాని ద్వారానే ఎవరైనా సరే రేణు దేశాయ్ ని సంప్రదించాల్సి ఉంటుంది.. ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ కి ఈమె కాస్త బ్రేక్ ఇచ్చేసింది. ఒక పది రోజులు ఇంస్టాగ్రామ్ ను వాడుకుండా ఉంటుందట.. వెకేషన్ కోసం రేణు దేశాయ్ బయటకు వెళ్తోందట.. అందుకే ఇలా ఇంస్టాగ్రామ్ కి పది రోజులపాటు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇక ప్రస్తుతం రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ కి బ్రేక్ ఇస్తోందని తెలిసి ఆమెను ఫాలో అయ్యే నెటిజన్స్ మొత్తం షాక్ అవుతున్నారు.. త్వరగా ఇంస్టాగ్రామ్ లోకి రావాలి అని.. పలు విషయాలపై స్పందించాలని కోరుకుంటున్నారు.

రేణూ దేశాయ్ కెరియర్..

ఇక రేణూ దేశాయ్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్ గా , కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాల గురించి అందరూ చెబుతారు… కానీ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఈమె ఏ ఏ చిత్రాలకు పనిచేసింది అంటే మాత్రం చెప్పడం కొంచెం కష్టమే.. మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా ద్వారా క్యాస్టింగ్ డిజైనర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత 2003లో కూడా జానీ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది.. 2004లో వచ్చిన గుడుంబా శంకర్, 2005లో బాలు, 2006లో అన్నవరం ఇలా అన్నీ కూడా తన భర్త పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలకు మాత్రమే కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించిన ఈమె.. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి సహజీవనం చేసింది.. 2004లో పెళ్లికాకముందే అబ్బాయి అకీరా నందన్ కి జన్మనిచ్చిన ఈమే 2009 జనవరి 28న పెద్దల సమక్షంలో, పిల్లవాడి సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2010లో ఆధ్యా పుట్టింది. 2011లో విడాకులకు అప్లై చేయగా 2012లో విడాకులు తీసుకున్నారు.. ఇక ఇప్పటినుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. మళ్లీ 2022లో టైగర్ నాగేశ్వరరావు సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడమే కాకుండా ఆ సినిమాలో హేమలత లవణం క్యారెక్టర్ లో కూడా నటించి మెప్పించింది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు