Samyukta Menon: తెలుగు, తమిళ్, మలయాళం లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా తన జీవితాన్ని గడిపేస్తుంది సంయుక్త మీనన్. బిజీ బిజీగా చిత్రాలు చేస్తుంది. ఇక బాలీవుడ్ లోనూ సంయుక్త ఎంట్రీ ఇవ్వబోతుంది. మహారాగ్ని మూవీలో ఓ కీలక పాత్రలో ఆమె నటిస్తుంది.
స్పై ఫేమ్ చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ మూవీకి డైరెక్షన్ వహించారు. చరణ్ తేజ్ కూడా ఈ మూవీ తోనే బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. ఇక 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ మళ్ళీ జత కట్టడం విశేషం. ఇక తాజాగా ఈ మూవీ నేడు అనగా మే 28న రిలీజ్ అయింది. ఈ మూవీ గ్లిమ్స్ ఫుల్ యాక్షన్ తో కూడి ఉన్నాయి.
విమానం నుంచి ప్రభుదేవా స్టైలిష్ గా దిగి.. నోట్లో చుట్ట.. చేతిలో బేస్ బాల్ స్టిక్ పట్టుకుని నడవడంతో ఈ గ్లిమ్స్ మొదలైంది. ఆ తరువాత కారు రేసింగ్ లో గ్లామరస్ డ్రెస్ లో సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చింది. యమ స్పీడ్ గా కారు నడుపుతూ.. సంయుక్త డైలాగ్ ఉంది. ఇక కాజోల్ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంది. కొండతో విలన్లను బాదే శారు కాజోల్. పవర్ యాక్షన్ అండ్ డైలాగ్ తో ఎండ్ అయింది. ప్రెసెంట్ ఈ మూవీ గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.