Hyper Adhi: దాదాపు దశాబ్ద కాలానికి పైగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది.. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కమెడియన్ గా పనిచేసిన ఈయన ఆ తర్వాత ఢీ డాన్స్ జోడి కార్యక్రమంలో టీం లీడర్ గా, హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక అంతేకాదు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు.. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తూ పేరు సొంతం చేసుకున్న హైపర్ ఆది.. ఇప్పుడు రాజకీయాలలో కూడా తలదూరుస్తూ ఈయన చేసే కామెంట్లు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
పవన్ కు మద్దతుగా హైపర్ ఆది ప్రచారం..
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా..అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు.. ఈ నేపథ్యంలోనే పిఠాపురం వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేపట్టారు హైపర్ ఆది.. ప్రచారం సమయంలో అటు వైసీపీని టార్గెట్ చేస్తూ ఈయన చేసిన కామెంట్లు వైసిపి నేతలకు పూర్తిస్థాయిలో ఆగ్రహం తెప్పించాయి.. అంతేకాదు జబర్దస్త్ స్కిట్స్ లో కూడా అప్పుడప్పుడు రాజకీయంగా బడానేతలను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లకు వైసీపీ అభిమానులు తగిన రీతిలోని బుద్ధి చెప్పారు.. అయినా సరే ఇప్పుడు తన బుద్ధిని పోనించుకోలేదు హైపర్ ఆది..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆది..
తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఫార్చ్యూన్ ఫోర్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి .. ఈ సినిమాలో విశ్వక్ జోడిగా నేహా శెట్టి నటిస్తూ ఉండగా.. గోపరాజు రమణ, హైపర్ ఆది, అంజలి, సాయికుమార్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. మే 31వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు .. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేసి విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ , అడివి శేష్ వంటి యంగ్ హీరోలపై ప్రశంసలు కురిపించారు.. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను ఇంప్రెస్ చేయడానికి హైపర్ ఆది చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి..
రాజకీయ చిచ్చు పెట్టిన ఆది..
హైపర్ ఆది మాట్లాడుతూ.. నందమూరి నటసింహం బాలకృష్ణ , కొణిదెల కొదమసింహం పవన్ కళ్యాణ్ కలిసి రేప్పోద్దున అసెంబ్లీలో అడుగుపెడితే ఎలాంటి కిక్ అయితే వస్తుందో.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అలాంటి కిక్కే ఇస్తోంది.. అంటూ కామెంట్లు చేశారు.. మరొకవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలనే వైసీపీ ప్రభుత్వం పట్టుబట్టి కూర్చుంది.. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా హైపర్ ఆది చేసిన కామెంట్లను వైసిపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.. వంగా గీతా వర్సెస్ పవన్ కళ్యాణ్ నేపథ్యంలో ఇప్పుడు హైపర్ ఆది చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.. మరి ఒకవేళ వంగా గీతా గెలిస్తే వైసిపి దెబ్బకు ఆది తట్టుకుంటాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.