Jagapathi Babu.. కెరియర్ ఆరంభంలోనే విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి ఫ్యామిలీ హీరోగా పేరు సొంతం చేసుకున్న జగపతిబాబు.. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ పేరు సొంతం చేసుకున్నారు. ఇక బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి విలన్ గా పరిచయమై.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. అంతకుమించి క్రేజ్ సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం వరుస సినిమాలను ప్రకటిస్తూ అటు విలన్ గా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంటూ బిజీ యాక్టర్ అయిపోయారు జగపతిబాబు. ఇకపోతే వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈయన తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. తాను మోసపోయానంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మోసపోయాను అంటున్న జగపతిబాబు..
రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతాయని అందరికీ తెలుసు.. అయితే అందులో కాస్త మెలకువతో ఉండాలి.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టాలు చవి చూడక తప్పదు.. ఇప్పుడు అదే విషయంలో ఇబ్బంది పడుతున్నానని చెప్పారు జగపతిబాబు.. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.. వాళ్ళ ట్రాప్ లో పడకూడదని అభిమానులకు సూచించారు.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు జగపతిబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రీసెంట్గా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విషయం పైన జగపతిబాబు స్పందిస్తూ ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది.
తన పోస్ట్ లో.. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రీసెంట్ గానే హెచ్చరించారు.. ఒక రియల్ ఎస్టేట్ యాడ్లో కూడా నేను నటించాను.. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు.. ఇక వాళ్ళు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే అన్ని వివరాలు త్వరలోనే చెబుతాను.. ముఖ్యంగా భూమి కొనేముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ కచ్చితంగా మీరు తెలుసుకోవాలి.. ఆ తర్వాతే భూమి కొనుగోలు చేయాలి.. అంటూ జగపతిబాబు తెలిపారు.. ఇక ప్రస్తుతం జగపతిబాబు చేసిన ఈ అలర్ట్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
జగపతిబాబు సినిమాలు..
జగపతిబాబు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఏది పడితే అది చేయకుండా తన మనసుకు నచ్చిన ప్రాజెక్టులే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో జగపతిబాబు నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవలే చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అందులో ఆయన లుక్ కి సంబంధించిన ఫోటో ని కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఇక ఇంటెన్స్ లుక్ లో శక్తివంతంగా కనిపించారు జగపతిబాబు.. రవితేజతో ఢీ అంటే ఢీ అనే క్యారెక్టర్ లో ఆయన అదరగొట్టడం ఖాయం అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.. ఇక జగపతి ముందు చాలా ఆఫర్లు ఉన్నాయని .. అయితే రోల్ బాగుంటేనే చేయాలని ఆయన అనుకుంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఏదేమైనా అటు హీరోగా ఇటు విలన్ గా సత్తా చాటుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంటున్నారు జగపతిబాబు.